10న సైన్యంలోకి రాఫెల్ విమానాలు - ఫ్రాన్స్ మంత్రి అతిథిగా రాజ్‌నాథ్ చేత - అక్టోబర్‌లో రెండో బ్యాచ్

ప్రపంచంలోనే మేటి యుద్ధ విమానాలుగా పేరుపొందిన రాఫెల్ ఫైటర్ జెట్స్ భారత వాయుసేనలో చేరిపోయేందుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 10న అంబాలాలోని ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా ఐఏఎఫ్ కు అప్పగించనున్నారు. ఫ్రాన్స్ నుంచి ఈ విమానాలు జులై 29న భారత్ కు చేరిన సంగతి తెలిసిందే.

రాఫెల్ విమానాలను ఐఏఎఫ్ కు అప్పగించే వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 10న అంబాలాలో జరిగే ఈవెంట్ కు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్టీ కూడా హాజరవుతారని వెల్లడించారు. సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు రష్యాలో జరిగే ''షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్' సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో రాజ్ నాథ్ పాల్గొంటారనీ పేర్కొన్నారు.

IAF to formally induct Rafale jets on September 10, Second batch to arrive in October

మొత్తం రూ.59 వేల కోట్లతో 36 రాఫెల్ విమానాలు అందించేలా భారత్ ప్రభుత్వం.. ప్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకోగా, మొదటి విడతలో ఐదు విమానాలు గత నెలలోనే మనకు చేరాయి. వాటిలో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇక రెండో విడత విమానాలు సైతం అక్టోబర్ లోనే భారత్ కు చేరుతాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

గగనతంలో వేగంగా ప్రయాణిస్తూ, భూమ్మీదున్న టార్గెట్లను కచ్చితంగా ఛేదించడం, ఎయిర్ టు ఎయిర్ ఫైట్ లోనూ దీటుగా వ్యవహరించడం, దీర్ఘ శ్రేణి రాకెట్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు రాఫెల్ సొంతం. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గకపోవడం, ఎల్ఏసీ వెంబడి చైనా యుద్ధ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్న దరిమిలా ఎయిర్ ఫోర్స్ లోకి రాఫెల్ విమానాలు చేరుతుండటం భారత వాయుసేనకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+