వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:స్టెప్పులతో అదరగొట్టిన ఐఏఎస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వీడియో

|
Google Oneindia TeluguNews

ఐఏఎస్.. అంటే తలకుమించిన భారం.. పని ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూనే ఉంటారు. వారికి రెస్ట్.. అంటూ ఉండదు. అయితే ఇటీవల కొందరు ఐఏఎస్ అధికారులు ఆటవిడుపుగా డ్యాన్స్ చేస్తున్నారు. కేరళలో ఓ మహిళ ఐఏఎస్ అధికారి స్టెప్పులేసినా సంగతి తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక అధికారి వంతు వచ్చింది. అతను కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు.

ఐఏఎస్ డ్యాన్స్

ఐఏఎస్ డ్యాన్స్


ఇటీవల దార్వాడ్‌లో ఓ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. దానికి హుబ్బలీ ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్, బీ గోపాల్ కృష్ణ హాజరయ్యారు. అయితే అతను హుషారుగా స్టెప్పులు వేశాడు. పాపులర్ కన్నడ పాటకు జోరుగా డ్యాన్స్ చేశాడు. ఇంకేముంది అక్కడున్న వారు.. హెచ్‌డీఎంసీ ఉద్యోగులు మరింత జోష్ నింపారు. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం అని గోపాల కృష్ణ తెలిపారు. పాఠశాల వయస్సు నుంచే ఇష్టమని.. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నానని వివరించారు.

అదిరే స్టెప్పులతో

అదిరే స్టెప్పులతో


ఐఏఎస్ అధికారి డ్యాన్స్ అదిరింది. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకేముంది నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వావ్ చాలా బాగుందని పొగుడుతున్నారు. చాలా బాగా చేశారు.. ప్రొఫెషనల్ అంటున్నారు. మరో యూజర్.. తన ప్రేయసి రిజెక్ట్ చేయడంతో.. యూపీఎస్సీ జాబ్ వచ్చిందని అంటున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

 అప్పుడప్పుడు డ్యాన్స్

అప్పుడప్పుడు డ్యాన్స్


అవును.. అధికారులు అయినంత మాత్రానా 24 గంటలు బిజీగా ఉండాలని ఏమీ లేదు. సమయం దొరికినప్పుడు అలా ఆట, పాటలతో మునిగి పోవచ్చు. దీంతో స్ట్రెస్ ప్రీ దొరుకుతుంది. ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో.. ఎప్పుడూ పని ఒత్తిడి అని కాకుండా.. సరదాగా గడపాలని కోరుతున్నారు. సో మీరు అలా ట్రై చేయండి అంటూ నెటిజన్లు మిగతా అధికారులకు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
Karnataka IAS officer B Gopal Krishna has gone viral on social media for a very special reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X