పన్నీర్ గ్రేవీ ఆర్డర్ చేస్తే స్టార్ హోటల్ లో హైకోర్టు లాయర్ కు ఏం ఇచ్చారంటే ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరులోని రాజ్‌భవన్ రోడ్డులోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక కనిపించిందని ఆ హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు లాయర్ విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. స్టార్ హోటల్ లోని వంట గదిలో వీడియో తియ్యడానికి ప్రయత్నించిన తన మీద హోటల్ సిబ్బంది దాడి చెయ్యడానికి ప్రయత్నించారని లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్ణాటక హైకోర్టు న్యాయవాది షీలా దీపక్ మద్యాహ్నం రాజ్ భవన్ రోడ్డులోని స్టార్ హోటల్ లో భోజనం చెయ్యడానికి వెళ్లారు. తాను ఆర్డర్ చేసిన పన్నీర్ గ్రేవీని సగం తిన్న తర్వాత అందులో బొద్దింక కనిపించడంతో తాను షాక్ అయ్యానని హైకోర్టు లాయర్ షీలా దీపక్ ఆరోపించారు. దీనిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా మరో భోజనం, పన్నీర్ గ్రేవీ అందిస్తామని చెప్పారని లాయర్ షీలా దీపక్ అన్నారు.

కానీ న్యాయవాది దానిని ఖండించారు. బొద్దింక దొరికిన భోజనాన్ని వీడియోసిన లాయర్ తరువాత స్టార్ హోటల్ లోని వంటగదిని తనిఖీ చేసి వీడియో తియ్యడానికి ప్రయత్నించారు. స్టార్ గదిలోని వంట గదిలో వీడియో తీయబోతుంటే హోటల్ సిబ్బంది న్యాయవాదితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా తనను అనరాని మాటలతో దుర్భాషలాడారని లాయర్ షీలా దీపక్ ఆరోపిస్తున్నారు.
దీంతో లాయర్ షీలా దీపక్ వెంటనే పోలీసులకు, బీబీఎంపీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేశారు. భోజనంలో బొద్దింక కనిపించిందని ప్రశ్నించినందుకు హోటల్ సిబ్బంది తనను దురుసుగా తోసి, అనరాని మాటలతో దుర్భాషలాడారని ఆరోపిస్తూ న్యాయవాది షీలా దీపక్ బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 352, 341, 504, 506 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయవాది ఫిర్యాదు మేరకు విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. హోటల్‌లోని ఇద్దరు వ్యక్తులను అసభ్యపదజాలంతో తనను దూషించి బయటకు ఈడ్చుకెళ్లారని లాయర్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు బంద్ చేసిన సమయంలో పోలీసులకు అందించిన ఫలావ్ లో ఎలుక బయటపడటం అప్పట్లో కలకలం రేపింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications