PPF: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. రూ.40,68,209 రాబడి..!

చాలా మంది డబ్బులు సంపాదిస్తారు.. కానీ సంపాదించిన దాంట్లో అదా చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అదా చేసిన డబ్బుతో మరింత డబ్బు సంపాదించేవారు ఇంకా తక్కువగా ఉంటారు. ఇలాంటి వారి కోసం కచ్చితమైన ఆదాయం వచ్చే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(PPF). ఇది ఎలాంటి రిస్క్ లేని పథకం. ఇందులో పెట్టుబడి పెడితే కచ్చిమైన ఆదాయం వస్తుంది. అలాగే మీరు ఒకవేళ ట్యాక్స్ కడుతుంటే..పీపీఎఫ్ లో చెల్లించన మొత్తాన్ని మినహాయింపు పొందవచ్చు.

పీపీఎఫ్ ఖాతాను బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో తెరవొచ్చు. మీరు పీపీఎఫ్ ఖాతా తెరవాలంటే కచ్చితంగా భారతీయుడై ఉండాలి. పిల్లల పేరుపైకూడా పీపీఎఫ్ ఖాతా తీసుకొచ్చు. ఖాతా తీసుకున్న తర్వాత మీరు సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ లో 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయంపై అధారపడి ఉంటుంది. పీపీఎఫ్ కు 15 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. ఈ మీరు ఈ పథకంలో నెలకు రూ.2 వేలు చెల్లిస్తే.. ఏడాదికి రూ.24 వేలు జమ చేస్తారు.

If you invest Rs 12500 per month in PPF scheme you will get Rs 4068209

15 సంవత్సరాల్లో రూ.3,60,000 చెల్లిస్తారు. మీకు వడ్డీ రూ.2,90,913 లతో కలిపి రూ.6,50,913 వస్తాయి. ఒక వేళ మీరు నెలకు రూ.5 వేలు కడితే సంవత్సరానికి రూ.60 వేలు చెల్లిస్తారు. 15 సంవత్సరాల్లో రూ.9 లక్షలు పెట్టుబడి పెడతారు. మీకు రూ.7 లక్షలకు పైగా వడ్డీతో కలిపి మొత్తం రూ. 16,27,284 చెల్లిస్తారు. మీరు నెలకు రూ.12,500 కడితే సంవత్సరానికి రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల్లో రూ.22,50,000 కడితే వడ్డీ రూ.18,18,209 కలిపి మొత్తం రూ.40,68,209 రిటర్న్స్ వస్తాయి.

అయితే ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తే వచ్చే డబ్బులో తేడా ఉంటుంది. మీరు 15 సంవత్సరాల మరో 5 సంవర్సాలు పథకాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ లో పెట్టుబడి పెడుతున్న వారు దానిపై లోన్ కూడా తీసుకోవచ్చు. సెక్షన్ 80 సీ కింది పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తన్ని మినహాయింపు పొందవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+