Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వందేమాతరం ఆలపించే వారు భారత వ్యతిరేక శక్తులే: ప్రకాష్ అంబేడ్కర్

ప్రభాని: దేశభక్తి గీతం వందేమాతరం పాడినవారంతా భారత్‌కు వ్యతిరేకం అన్నారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మనువడు ప్రకాష్ అంబేడ్కర్. " జనగణమన పాడితే నేను భారత్‌కు వ్యతిరేకం అంటున్నారు. అదే వందేమాతరం గీతం ఆలపిస్తే నేను నిజమైన భారతీయుడిని అని అంటున్నారు. ఇలా సర్టిఫికేట్ ఇచ్చేందుకు మీరెవరు..? వందేమాతరం ఎవరైతే పాడుతారో వారు భారత వ్యతిరేక శక్తులు అని నేను చెబుతున్నాను" అని ప్రకాష్ అంబేడ్కర్ నిప్పులు చెరిగారు.

2019 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్రలో ప్రకాష్ అంబేడ్కర్ పార్టీ భరిప బహుజన్ మహాసంగ్ మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు గతనెలలో ప్రకటన చేశారు. ఈ ఏడాది ఆగష్టులోనే వందేమాతరం తప్పని సరి చేయడం రాజ్యాంగ విరుద్ధమని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అంతేకాదు ప్రధాని దేశంలో ఒక్క మతాన్నే ప్రమోట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా హిందూ మతాన్ని మాత్రమే దేశంలో ప్రమోట్ చేయడం ద్వారా దేశ లౌకికత్వం దెబ్బతింటుందని ఓవైసీ ధ్వజమెత్తారు.

If you sing Vandemataram then you are anti India: Praksah Ambedkar

మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గానికి ఒకప్పుడు ఎంపీగా పనిచేశారు ప్రకాష్ అంబేడ్కర్. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వామపక్షాలు ఆయన్ను నామినేట్ చేశాయి. ఆనాడు ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పై పోటీకి ప్రకాష్ అంబేడ్కర్‌ను నిలబెట్టాయి వామపక్షాలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+