Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్త వాకింగ్ కు, ఇంట్లో మంచం ఊగిపోయింది, భార్య తల తెగిపోయింది, ప్రియుడిది కట్ !

లక్నో/ ఉత్తరప్రదేశ్: పెళ్లి చేసుకున్న భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు భర్త. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పక్కింటి కుర్రాడు లైట్ బాగా వెలిగిస్తాడని అతని మోజులో పడిపోయింది భార్య. అంతే అప్పటి నుంచి భార్య, ప్రియుడు రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. కొడుకులు కోచింగ్ సెంటర్ కు వెళ్లడం, భర్త వాకింగ్ కు వెళ్లడంతో ఉదయాన్నే భార్య ప్రియుడితో కలిసి బెడ్ రూమ్ లో బిజీ అయిపోవడంతో మంచం ఊగిపోయింది. అనుకోకుండా ఇంట్లో అడుగుపెట్టిన భర్త భార్య భాగోతం చూసి రగిలిపోయి గొడ్డలి తీసుకుని ఆమె తల, మొండెం రెండు ముక్కలుగా నరికేశాడు. భార్య ప్రియుడిని ఎక్కడ నరకాలో అక్కడే నరికేశాడు. భార్య తల ఎత్తుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త మళయాలం సినిమా స్టోరీలాగా మొత్తం వివరించడంతో పోలీసు అధికారులు షాక్ కు గురైనారు.

 పక్కింటోడితో కష్టాలు

పక్కింటోడితో కష్టాలు

ఉత్దర్ ప్రదేశ్ లో నేరాలు ఘోరాలు ఏ రైంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లోని బంబేరూ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా ప్రాంతంలో చిన్నార్ యాదవ్ (42), విమలా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. చిన్నార్ యాదవ్, విమలా దంపతులకు భగత్, ప్రహ్లాద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య విమలా, కొడుకులతో కలిసి చిన్నార్ యాదవ్ సంవత్సరం క్రితం వరకు చాలా హ్యాపీగా లైఫ్ గడిపాడు. తరువాత పక్కింటోడి రూపంలో చిన్నార్ యాదవ్ కు సినిమా కష్టాలు మొదలైనాయి.

 సూపర్ ఎలక్ట్రీషియన్

సూపర్ ఎలక్ట్రీషియన్

చిన్నార్ యాదవ్ ఇంటి సమీపంలోనే రవికాంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రవికాంత్ ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న చిన్నార్ యాదవ్, రవికాంత్ ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్లు. రవికాంత్ అప్పడప్పుడు సమీపంలో నివాసం ఉంటున్న చిన్నార్ యాదవ్ ఇంటికి వెళ్లేవాడు.

 కుర్రాడు లైట్ భలే వెలిగిస్తాడు

కుర్రాడు లైట్ భలే వెలిగిస్తాడు

భర్త చిన్నార్ యాదవ్ కోసం వచ్చి వెలుతున్న రవికాంత్ తో విమలా పరిచయం పెంచుకుంది. భార్య విమలా, రవికాంత్ పరిచయం చనువుగా మారింది. కుర్రాడు లైట్ భలే వెలిగిస్తాడని తెలుసుకున్న విమలా అతన్ని లైన్ లో పెట్టి భర్త చిన్నార్ యాదవ్, కొడుకులు లేని సమయంలో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇలా ఇద్దరి రాసలీలలు గత ఏడాది నుంచి నాన్ స్టాప్ ఆర్ టీసీ బస్సులాగా వెలుతోంది.

 భర్త చెప్పినా పట్టించుకోని భార్య

భర్త చెప్పినా పట్టించుకోని భార్య

విమలా, రవికాంత్ భాగోతం గురించి చుట్టుపక్కల వాళ్లు చెబితే తెలుసుకున్న చిన్నార్ యాదవ్ కొంతకాలం ఓపికపట్టాడు. కొన్ని నెలల క్రితం నువ్వు జాగ్రతగా ఉండాలని, అసలే నేను మంచోడుకాదని, తరువాత బాధపడటానికి నువ్వు ఈ భూమీ మీద ఉండవని భార్య విమలాను భర్త చిన్నార్ యాదవ్ హెచ్చరించాడు. అయినా భార్య విమలా భర్త మాటలు పట్టించుకోకుండా వీలు చిక్కినప్పుడు ప్రియుడు రవికాంత్ ను ఇంటికి పిలిపించుకుని ఆమె కామకోరికలు తీర్చుకునింది.

 భర్త వాకింగ్ కు, కొడుకులు కోచింగ్ సెంటర్ కు

భర్త వాకింగ్ కు, కొడుకులు కోచింగ్ సెంటర్ కు

ఉదయం నిద్రలేచిన భర్త చిన్నార్ యాదవ్ వాకింగ్ కు వెళ్లాడు. కరోనా దెబ్బకు విద్యాసంస్థలు మూసివేయడంతో ఇంట్లోనే ఉంటున్న విమలా కొడుకులు భగత్, ప్రహ్లాద్ ఉదయం 7. 30 గంటల సమయంలో కోచింగ్ సెంటర్ లో ట్యూషన్ కు వెళ్లారు. ఆ సందర్బంలో ప్రియుడు రవికాంత్ కు ఫోన్ చేసిన విమలా అతన్ని ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేరని రవికాంత్ రెచ్చిపోయాడు.

 మంచం ఊగిపోయింది... భార్య తల తెగిపోయింది

మంచం ఊగిపోయింది... భార్య తల తెగిపోయింది

వాకింగ్ మద్యలోనే ముగించుకున్న చిన్నార్ యాదవ్ నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇంట్లోని బెడ్ రూమ్ లో భార్య విమలా, ప్రియుడు రవికాంత్ మంచి రసపట్టులో ఉండటంతో మంచం ఊగిపోతున్న విషయం గుర్తించిన చిన్నార్ యాదవ్ రగిలిపోయాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన చిన్నార్ యాదవ్ ఇంట్లోని పదునైన గొడ్డలి తీసుకుని భార్య విమలా, ఆమె ప్రియుడు రవికాంత్ మీద దాడి చేశాడు. చిన్నార్ యాదవ్ గొడ్డలితో దాడి చెయ్యడంతో భార్య విమలా తల తెగిపోయి మొండెం నుంచి వేరుపడింది. ప్రియుడు రవికాంత్ గౌడకు ఎక్కడ నరకాలో అక్కడే నరకడంతో అతను కుప్పకూలిపోయాడు.

 భార్య విమలా తల ఊరేగింపు

భార్య విమలా తల ఊరేగింపు

భార్య విమలా మొండెం, తల వేరు చేసిన చిన్నార్ యాదవ్ ఓ పనైపోయిందని అనుకున్నాడు. భార్య తల చేతిలో పట్టుకున్న చిన్నార్ యాదవ్ నేరుగా రెండు కిలోమీటర్ల దూరం తాపీగా నడుచుకుంటూ బబేరూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లాడు. చిన్నార్ యాదవ్ భార్య తల చేతిలో పట్టుకుని వెలుతున్న సమయంలో స్థానికులు భయంతో పరుగు తీశారు. కొందరు తలతో చిన్నార్ యాదవ్ వెలుతున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

Recommended Video

    India-China Stand Off : China ను దెబ్బ తీసేలా LAC వద్ద Nirbhay Missile ‌ను మోహరించిన భారత్!
     చిలకకు చెప్పినట్లు చెప్పినా విమలా వినలేదు

    చిలకకు చెప్పినట్లు చెప్పినా విమలా వినలేదు

    పోలీస్ స్టేషన్ లో చిన్నార్ యాదవ్ చేతిలో తలను చూసిన పోలీసులు 15 నిమిషాల పాటు షాక్ కు గురై ఏమీ చెయ్యలేకపోయి పై అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మహేంద్ర పీ. చౌహాన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. విమలా తల నరికిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా భార్య విమలాకు చిలకకు చెప్పినట్లు మంచిమాటలు చెప్పినా వినలేదు, మా కుటుంబం పరువు తీసిందని, అందుకే తల నరికేశానని చిన్నార్ యాదవ్ నేరం అంగీకరించాడని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మహేంద్ర చౌహాన్ మీడియాకు చెప్పారు. విమలా ప్రియుడు రవికాంత్ కు తీవ్రగాయాలు కావడంతో అతను జిల్లా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+