Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Daughter: పక్కింట్లో ప్రియుడు, ప్రియురాలి కూతురిని చంపేసిన ప్రియుడి భార్య, ఏదో అనుకుంటే !

చెన్నై/ఈరోడ్/ కడలూరు: రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్న మహిళలు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు మహిళలకు భర్తలు, పిల్లలు ఉన్నారు. పండుగలు, శుభకార్యాలు, ఫంక్షన్లకు వీళ్లు ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో స్నేహితురాలి భర్తతో పక్కంటి లేడీ అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న పక్కంటి ప్రియురాలి కూతురు చదువుకు అయ్యే ఖర్చు మొత్తం పక్కింటి ప్రియుడు ఇచ్చాడు. తన స్నేహితురాలి పిల్లల చదువులకు తన భర్త ఖర్చు చేస్తున్నాడని తెలుసుకున్న భార్య ఆమె భర్తతో గొడవ పెట్టుకుంది. నేను సంపాధిస్తున్న డబ్బులు ఏమైనా చేసుకుంటాను, నాష్టం వచ్చినట్లు చేసుకుంటాను, నా ప్రియురాలు కూతురు నా కూతురితో సమానం, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకూడదు అంటూ భర్త తేల్చి చెప్పాడు. నా భర్తను వలలో వేసుకున్న నా స్నేహితురాలు నా కొంప ముంచుతోందని రగిలిపోయిన భార్య పక్కింటి లేడీ మీద కసి పెంచుకుంది. ఇంత జరగడానికి నా ఫ్రెండ్ కూతురు కారణం అని ఆ అమ్మాయిని పక్కాప్లాన్ తో చంపేసి ఇంటి వెనుక శవం విసిరేసిన లేడీ చేతులు దులుపుకుంది. అయితే చేసిన పాపం ఊరికేపోదు అనే సామెతలా బాలికను పక్కంటి లేడీ చంపేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పక్కపక్క ఇళ్లల్లో కాపురాలు

పక్కపక్క ఇళ్లల్లో కాపురాలు

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని పెరంబదురై సమీపంలోని కారుమండి సెల్లియపాళయంలోని అంగప్పవీధిలో షణ్ముగం అనే వ్యక్తి అతని భార్య కనక, కుమారుడు విను, కుమార్తె కనితో కలిసి నివాసం ఉంటున్నాడు. షణ్ముగం పక్క ఇంటిలో కమలకన్నన్ అనే వ్యక్తి అతని భార్య వనితతో కలిసి నివాసం ఉంటున్నాడు.

లేడీస్ ఫ్రెండ్స్

లేడీస్ ఫ్రెండ్స్


పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్న వనితచ కనక అనే మహిళలు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరు మహిళలు వనిత, కనకలు భర్తలు, పిల్లలతో కలిసి వాళ్లవాళ్ల ఇళ్లల్లో సంతోషంగా ఉండేవారు. పండుగలు, శుభకార్యాలు, ఫంక్షన్లకు షణ్ముగం, కమలకన్నన్ కుటుంబ సభ్యులు ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చి వెళ్లేవారు.

ఫ్రెండ్ భర్తతో కిలాడీ లేడీ అక్రమ సంబంధం

ఫ్రెండ్ భర్తతో కిలాడీ లేడీ అక్రమ సంబంధం

స్నేహితురాలు వనిత భర్త కమలకన్నన్ తో పక్కంటి లేడీ కనక అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న పక్కంటి ప్రియురాలు కనక కూతురు కని చదువుకు అయ్యే ఖర్చు మొత్తం పక్కింటి ప్రియుడు కమలకన్నన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన స్నేహితురాలు కనక పిల్లల చదువులకు తన భర్త కమలకన్నన్ ఖర్చు చేస్తున్నాడని తెలుసుకున్న అతని భార్య వనిత ఆమె భర్తతో గొడవ పెట్టుకుంది.

భర్త ప్రియురాలి మీద పగ

భర్త ప్రియురాలి మీద పగ


నేను సంపాధిస్తున్న డబ్బులు ఏమైనా చేసుకుంటాను, నాష్టం వచ్చినట్లు చేసుకుంటాను, నా ప్రియురాలు కనక కూతురు కని నా కూతురితో సమానం, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకూడదు అంటూ కమలకన్నన్ అతని భార్య వనితకు తేల్చి చెప్పాడు. నా భర్త కమలకన్నన్ ను వలలో వేసుకున్న నా స్నేహితురాలు కనక నా కొంప ముంచుతోందని రగిలిపోయిన వనిత పక్కింటి లేడీ కనక, ఆమె కూతురు కని మీద కసి పెంచుకుంది.

భర్త ప్రియురాలి కూతురిని చంపేసింది

భర్త ప్రియురాలి కూతురిని చంపేసింది


మా ఇంట్లో ఇంత గొడవలు జరగడానికి నా ఫ్రెండ్ కనక కూతురు కని కారణం అని వనిత రగిలిపోయింది. 2018 మే 12వ తేదీన కనక ఫ్యాక్టరీలో పని చెయ్యడానికి, ఆమె భర్త షణ్ముగం ఉద్యోగం చెయ్యడానికి, కొడుకు బంధువుల ఇంటికి వెళ్లిపోయారు, ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కనక కూతురు కని ఆడుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో కనిని పక్కాప్లాన్ తో గొంతు నులిమి చంపేసిన వనిత అమ్మాయి ఇంటి వెనుక శవం విసిరేసి చేతులు దులుపుకుంది.

భర్త ప్రియురాలి హత్య కేసులో యావజ్జీవ శిక్ష

భర్త ప్రియురాలి హత్య కేసులో యావజ్జీవ శిక్ష

కనిని పక్కంటి లేడీ వనిత చంపేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వనితను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కనిని హత్య చేసింది వనిత అని నేరం రుజువు అయ్యిందని, ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని ఈరోడ్డు మహిళా కోర్టు న్యాయమూర్తి మాలతి తీర్పు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+