Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియురాలిని ఇంటికే పిలుచుకుని వెళ్లాడు, భార్య సైలెంట్, కూతురు రివర్స్, క్లైమాక్స్ లో !

చెన్నై/తిరుచ్చి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. భార్య, కూతురితో సంతోషంగా జీవిస్తున్న అతనికి వేరే మహిళతో పరిచయం అయ్యింది. రానురాను ఆ మహిళ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. మహిళ మోజులో పడిపోయిన వ్యక్తి సంపాధించిన డబ్బులు మొత్తం ప్రియురాలికి ఇచ్చేసి భార్యా, కూతురిని చిత్రహింసలకు గురి చేశాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. చివరికి ప్రియురాలిని ఇంటికే పిలుచుకుని వెళ్లిన అతను ఈమె ఇక్కడే మనతోనే ఉంటుందని భార్యకు చెప్పాడు. భర్త ఆగడాలను ఎదిరించలేక భార్య మౌనంగా ఉండిపోయింది. అయితే తండ్రి ప్రియురాలు ఇంటిలో ఉండటానికి కూతురు మాత్రం నిరాకరించింది. కూతురి తీరుతో రగిలిపోయిన తండ్రి ఆమెను కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచేయడం కలకలం రేపింది. కూతురిని చంపేసి ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన కామాంధుడికి ఇప్పుడు సినిమా కనపడుతోంది.

భార్య, కూతురితో మొదట్లో ?

భార్య, కూతురితో మొదట్లో ?

తమిళనాడులోని తిరుచ్చిలోని గజపేట్ బెల్స్ గ్రౌండ్స్ లో క్రిష్ణకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కనకవల్లి అనే మహిళను క్రిష్ణకుమార్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న క్రిష్ణకుమార్ అతని భార్య కనకవల్లితో సంతోషంగా కాపురం చేశాడు. క్రిష్ణకుమార్, కనకవల్లి దంపతులకు నాలుగవ తరగతి చదువుతున్న వర్షిణి అనే కూతురు కూడా ఉంది.

అదే ఏరియా మహిళ పరిచయం

అదే ఏరియా మహిళ పరిచయం

క్రిష్ణకుమార్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ అతని భార్య కనకవల్లి, కూతురు వర్షిణిని పోషిస్తున్నాడు. రెండు సంవత్సరాల వరకు క్రిష్ణకుమార్ అతని భార్య, కూతురితో సంతోషంగానే ఉన్నాడు. క్రిష్ణ కుమార్ నివాసం ఉంటున్న ఏరియాలో నివాసం ఉంటున్న తిలకవతి అనే మహిళతో అతనికి పరిచయం అయ్యింది.

పోటుగాడికి అక్రమ సంబంధం

పోటుగాడికి అక్రమ సంబంధం

రానురాను క్రిష్ణకుమార్, తికవతిల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. తిలకవతితో అక్రమ సంబంధం పెట్టుకున్న క్రిష్ణకుమార్ ఆమె మోజులో పడిపోయి ఇంటికి వెళ్లి అతని భార్య కనకవల్లికి నరకం చూపించడం మొదలుపెట్టాడు. తిలకవతి మోజులో పడిపోయిన క్రిష్ణకుమార్ సంపాధించిన డబ్బులు మొత్తం ప్రియురాలికి ఇచ్చేసి భార్యా, కూతురిని చిత్రహింసలకు గురి చేశాడు.

ప్రియురాలిని ఇంటికి పిలుచుకుని వెళ్లి ?

ప్రియురాలిని ఇంటికి పిలుచుకుని వెళ్లి ?

ప్రియురాలు తిలకవతి విషయంలో క్రిష్ణకుమార్, కనకవల్లి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. చివరికి ప్రియురాలు తిలకవతిని ఇంటికే పిలుచుకుని వెళ్లిన అతను ఈమె ఇక్కడే మనతోనే ఉంటుందని భార్య కనకవల్లికి చెప్పాడు. భర్త క్రిష్ణకుమార్ ఆగడాలను ఎదిరించలేక అతని భార్య కనకవల్లి మౌనంగా ఉండిపోయింది. అయితే తండ్రి క్రిష్ణకుమార్ ప్రియురాలు తిలకవతి ఇంటిలో ఉండటానికి అతని కూతురు వర్షణి మాత్రం నిరాకరించింది.

కూతురిని కత్తితో పొడిచేసిన తండ్రి

కూతురిని కత్తితో పొడిచేసిన తండ్రి


కూతురు వర్షణి తనకు ఎదురు తిరుగుతోందని రగిలిపోయిన క్రిష్ణకుమార్ ఆమెను కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచేయడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన వర్షిణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రియురాలు తిలవతి మోజులో పడిపోయిన తన భర్త క్రిష్ణకుమార్ తన కూతురు వర్షిణిని చంపడానికి ప్రయత్నించాడని కనకవల్లి పోలీసు కేసు పెట్టింది. కూతురిని చంపేసి ప్రియురాలు తిలకవతితో ఎంజాయ్ చెయ్యాలని ఆశపడిన కామాంధుడు క్రిష్ణకుమార్ కు బెండ్ తీసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించడంతో అతనికి ఇప్పుడు సినిమా కనపడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+