Illegal affair: లవ్ మ్యారేజ్, పక్కింటి ప్రియుడితో లేచిపోయిన భార్య, ఫేస్ బుక్ లో, ఆత్మహత్య !

బెంగళూరు/ విజయపుర: కొన్నిసంవత్సరాల పాటు యువతి, యువకుడు ప్రేమించుకుని సంతోషంగా తిరిగారు. రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ప్రేమికులు కాపురం పెట్టారు. దంపతులు పక్కంటిలోనే భర్త బందువు నివాసం ఉంటున్నాడు. భర్త బందువుతో అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ద్రోహం చేసిన భార్య పక్కింటి ప్రియుడితో జల్సా చేసింది. పక్కింటి ప్రియుడితో ఇటీవల భార్య లేచిపోయింది. భర్త కేసు పెట్టడంతో పోలీసులు కొన్ని రోజుల పాటు అతని భార్య కోసం గాలించి చివరికి పట్టుకుని వచ్చారు. నేను నా భర్తతో ఉండనని, నా ప్రియుడితో కలిసి జీవిస్తానని భార్య తేల్చి చెప్పింది. భార్య మేజర్ కావడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేసి ఆమెను మహిళా, శిశు సంక్షేమ శాఖ సంరక్షణా కేంద్రంలో ఉండటానికి ఏర్పాట్లు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య తన బంధువుతోనే లేచిపోయి తన పరువు తీసిందని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫేస్ బుక్ మెసేజ్ పోస్టు చేసిన భర్త అన్నంతపని చేశాడు.

ప్రేమికులు

ప్రేమికులు

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని తాళికోటే తాలుకాలోని బోమ్మనహళ్లిలో వెంకటేష్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి, వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకున్నారు. వెంకటేష్, రూపా చాలా సంతోషంగా కలిసిమెలసి తిరిగారు.

పక్కింటిలో భర్త బంధువు

పక్కింటిలో భర్త బంధువు


రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ప్రేమికులు వెంకటేష్, రూపా బోమ్మనహళ్లిలో కాపురం పెట్టారు. వెంకటేష్, రూపా దంపతులు పక్కంటిలోనే భర్త బందువు శ్రీశైల అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వెంకటేష్ బంధువు శ్రీశైల ప్రతిరోజూ అతని ఇంటికి వచ్చి వెలుతూ అతని భార్య రూపాతో చనువు పెంచుకున్నాడు.

భర్త బంధువుతో భార్య అక్రమ సంబంధం

భర్త బంధువుతో భార్య అక్రమ సంబంధం

భర్త వెంకటేష్ బంధువు శ్రీశైలతో అతని భార్య రూపా అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వెంకటేష్ కు ద్రోహం చేసిన అతని భార్య రూపా పక్కింటి ప్రియుడు శ్రీశైలాతో జల్సా చేసింది. చాలాకాలం రూపా, శ్రీశైలా అక్రమ సంబంధం విషయం బయటకురాకుండా సీక్రేట్ గా సాగిపోయింది.

ప్రియుడితో లేచిపోయిన భార్య

ప్రియుడితో లేచిపోయిన భార్య


ఇటీవల రూపా పక్కింటి ప్రియుడు శ్రీశైలాతో లేచిపోయింది. భర్త వెంకటేష్ కేసు పెట్టడంతో పోలీసులు కొన్ని రోజుల పాటు అతని భార్య రూపా కోసం గాలించారు. ప్రియుడు శ్రీశైలాతో కలిసి కాపురం చేస్తున్న రూపాను పోలీసులు పట్టుకుని వచ్చారు. పోలీసులు, బంధువులు, భర్త వెంకటేష్ ముందు రూపా అదరిపోయే మాటలు మాట్లాడింది.

నాకు మొగుడు వద్దు.... ప్రియుడే కావాలి

నాకు మొగుడు వద్దు.... ప్రియుడే కావాలి

నేను నా భర్త వెంకటేష్ తో కలిసికాపురం చెయ్యనని, నా ప్రియుడు శ్రీశైలాతో కలిసి జీవిస్తానని రూపా తేల్చి చెప్పింది. వెంకటేష్ భార్య రూపా మేజర్ కావడం, ఆమె భర్తతో కాపురం చెయ్యనని అడ్డం తిరగడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేసి ఆమెను మహిళా, శిశు సంక్షేమ శాఖ సంరక్షణా కేంద్రంలో ఉండటానికి ఏర్పాట్లు చేశారు.

ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య రూపా తన బంధువు శ్రీశైలాతోనే లేచిపోయి తన పరువు తీసిందని, నేను నా పొలంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని వెంకటేష్ ఫేస్ బుక్ మెసేజ్ పోస్టు చేశాడు. విషయం గుర్తించిన అతని బంధువులు పొలం దగ్గరకు పరుగు తీసే సమయానికి వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రూపా అక్రమ సంబంధం కారణంగా వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+