Wife: పెళ్లైన 8 నెలలకే బిడ్డ, పెళ్లికి ముందే నీకు?, ఎవడి బిడ్డకో నేను తండ్రా ?, గొంతుకోసి !
చెన్నై/కడలూరు/కుప్పం: యువతి, యువకుడికి 8 నెలల క్రితం పెళ్లి జరిగింది. భార్యతో భర్త చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య గర్బవతి అయ్యిందని తెలుసుకున్న భర్త చాలా ఖుషి అయ్యాడు. అయితే 8 నెలలకే భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కథ అడ్డం తిరిగింది. 9 నెలల తరువాత పుట్టాల్సిన బిడ్డ 8 నెలలకే ఎలా పుట్టాడు ?, పెళ్లికి ముందే నీకు రంకు మొగుడు ఉన్నాడా ?, ఎవడేవాడు ?, పెళ్లి తరువాత కూడా అతనితో తిరిగి కడుపు చేయించుకున్నావని, ఎవడికో పుట్టిన బిడ్డకు నేను తండ్రి ఎలా అవుతాను ? అంటూ భర్త రచ్చరచ్చ చేశాడు. భర్త ఎన్నిమాటలు అన్నా భార్య మౌనంగా ఉండిపోయింది. రాత్రి ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన భర్త భార్య గొంతు కోసి చంపేసి ఆత్మహత్యాయత్నం చేశాడు.

పెద్దలు డిసైడ్ చేసిన పెళ్లి
తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రూతి జిల్లా నాడుకుప్పం గ్రామంలో నివాసం ఉంటున్న అరుణాచలం (31) అనే యువకుడికి, కంగీరుప్పు గ్రామానికి చెందిన లక్ష్మీ (29) అనే యువతికి 2020 జూన్ నెలలో వివాహం అయ్యింది. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలోనే ముందుగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి అరుణాచలం, లక్ష్మీల పెళ్లి జరిగింది.

హ్యాపీలైఫ్ అనుకున్నాడు
పెళ్లి జరిగిన తరువాత లక్ష్మీ భర్త అరుణాచలం ఇంటికి వచ్చి అతనితో కాపురం చేస్తోంది. పెళ్లి జరిగిన తరువాత లక్ష్మీ మొదటి నాలుగు నెలలు ఎక్కువగా పుట్టింటికి వెళ్లింది. ఇదే సమయంలో భార్య లక్ష్మీ గర్బవతి అయ్యిందని తెలుసుకున్న అరుణాచలం తాను తండ్రిని కాబోతున్నానని ఎగిరిగంతేశాడు.

ఈ బిడ్డకు తండ్రి నేనేనా ?
భార్య లక్ష్మిని క్రమం తప్పకుండా ఆసుపత్రికి పిలుచుకుని వెలుతున్న అరుణాచలం తన భార్య, బిడ్డ క్షేమంగా ఉండేలా మీరే చూడాలని డాక్టర్ కు చెప్పాడు. అయితే అరుణాచలంకు నీ భార్య ఈ తేదీల్లో బిడ్డకు జన్మనిస్తుందని ఆ డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. 8 నెలలకే బిడ్డ ఎలాపుడుతాడు ?, ఈ బిడ్డకు తండ్రి నేనేనా అని అరుణాచలంకు భార్య లక్ష్మి ప్రవర్తన మీద అనుమానం పెరిగిపోయింది.

ఎవడే నీ రంకు మొగుడు ?, పెళ్లికి ముందే నువ్వు తల్లివా
పెళ్లి జరిగిన 8 నెలలకే అరుణాచలం, లక్ష్మీ దంపతులకు బిడ్డపుట్టాడు. అప్పటి నుంచి అరుణాచలంకు అతని భార్య లక్ష్మీ ప్రవర్తన మీద ఇంకా అనుమానం ఎక్కువ అయిపోయింది. 9 నెలల తరువాత పుట్టాల్సిన బిడ్డ 8 నెలలకే ఎలా పుట్టాడు ?, పెళ్లికి ముందే నీకు రంకు మొగుడు ఉన్నాడా ?, ఎవడెవాడు ?, పెళ్లి తరువాత కూడా అతనితో తిరిగి కడుపు చేయించకున్నావా అంటూ అరుణాచలం అతని భార్య లక్ష్మీతో రోజు గొడవపడటం మొదలుపెట్టాడు.

ఎవడి బిడ్డకు ఎవడు తండ్రి ?
ఎవడికో పుట్టిన బిడ్డకు నేను తండ్రి ఎలా అవుతాను ? అంటూ భర్త అరుణాచలం భార్య లక్ష్మీతో గొడవపడుతూ రచ్చరచ్చ చేశాడు. భర్త ఎన్నిమాటలు అన్నా భార్య లక్ష్మీ మౌనంగా ఉండిపోవడంతో భర్త అరుణాచలంకు మరింత అనుమానం ఎక్కువ అయ్యింది. భర్త అరుణాచలం రోజు గొడవ చెయ్యడంతో లక్ష్మీ పుట్టింటికి వెళ్లిపోయింది. కొందరికి 8 నెలల్లోనే పిల్లలు పుడుతారని కుటుంబ సభ్యులు నచ్చచెప్పి అరుణాచలం, లక్ష్మీ దంపతులను రాజీ చేశారు.

భార్య గొంతు కోసి చంపేశాడు
నెల క్రితం లక్ష్మీ బిడ్డను ఎత్తుకుని భర్త అరుణాచలం ఇంటికి వెళ్లింది. ఇటీవల మళ్లీ ఇదే రామాయణం మొదలైయ్యింది. రాత్రి ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన భర్త అరుణాచలం భార్య లక్ష్మీ గొంతు కోసి చంపేశాడు. తరువాత అరుణాచలం ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు.

ఏ బిడ్డ కోసమైతే ఇంత జరిగిందో..... అదే బిడ్డ కోసం ?
ఈ బిడ్డ నాకు పుట్టలేదు అని గొడవపడి భార్యను చంపేసిన అరుణాచలం ఉరి వేసుకునే సమయంలో బిడ్డ ఏడుపు ఎక్కువ కావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటే ఆ బిడ్డ దిక్కులేని వాడు అవుతాడని చివరి నిమిషంలో మనుసు మార్చుకున్నాడు. భార్య లక్ష్మీ గొంతు కోసి చంపేసిన భర్త అరుణాచలం నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని జరిగిన విషయం మొత్తం చెప్పి లొంగిపోయాడు.

పెళ్లికి ముందే అక్రమ సంబంధం ?
తన బిడ్డను బాగా చూసుకోవాలని అరుణాచలం అతని తల్లిదండ్రులకు చెప్పాడు. 8 నెలల్లో బిడ్డపుట్టడంతో భార్య లక్ష్మీ పెళ్లికి ముందు నుంచే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతోనే భార్యను హత్య చేశానని అరుణాచలం అంగీకరించాడని కడలూరు జిల్లా పోలీసులు అంటున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications