Illegal affair: ఎన్నికల డ్యూటీలో భర్త, ఫస్ట్ లవర్ తో భార్య ?, మరో ప్రియుడి ఎంట్రీతో, క్లైమాక్స్ !
కాన్పూర్/మణిపూర్: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సీఆర్ పీఎఫ్ లో అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. భర్త సీఆర్ పీఎఫ్ లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తుండటంతో అతని భార్యకు స్థానికులు మంచి మర్యాద, గౌరవం ఇస్తున్నారు. మణిపూర్ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి భర్త ఆ రాష్ట్రానికి వెళ్లాడు. కొన్ని రోజుల నుంచి మణిపూర్ లో విధులు నిర్వహిస్తున్న భర్త ప్రతిరోజూ అతని భార్య, పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. రెండు రోజుల క్రితం మణిపూర్ లో ఉన్న సీఆర్ పీఎఫ్ అధికారి అతని భార్యకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆరా తీయ్యగా సీఆర్ పీఎఫ్ అధికారి భార్య శవమై కనిపించింది. సీఆర్ పీఎఫ్ అధికారి భార్యను హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సీఆర్ పీఎఫ్ అధికారి భార్య చివరిసారిగా కారు మెకానిక్ తో మాట్లాడిందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు సీఆర్ పీఎఫ్ అధికారి భార్యకు, కారు మెకానిక్ కు చాలాకాలంగా అక్రమ సంబంధం ఉన్న విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తే సీఆర్ పీఎఫ్ అధికారి భార్యకు కారు మెకానిక్ తో కాకుండా మరో యువకుడితో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూడటం కలకలం రేపింది.

సీఆర్ పీఎఫ్ లో ఉద్యోగం
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇంద్రపాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన గీతా అనే యువతిని వివాహం చేసుకున్న ఇంద్రపాల్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. ఇంద్రపాల్, గీతా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గీతా భర్త ఇంద్రపాల్ సీఆర్ పీఎఫ్ లో అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు.

హ్యాపీలైఫ్ అనుకున్న భర్త
భార్య గీతాతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి ఇంద్రపాల్ కాన్పూర్ లోనే నివాసం ఉంటున్నాడు. ఉద్యోగానికి వెళ్లి వస్తున్న ఇంద్రపాల్ అతని భార్య గీతాను, ఇద్దరు పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. భార్య గీతా, పిల్లలు ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంద్రపాల్ కచ్చితంగా వారిని బయటకు పిలుచుకుని వెలుతున్నాడని అతని కుటుంబ సభ్యులు, బంధువులు అంటున్నారు.

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల డ్యూటీ
ఇంద్రపాల్ సీఆర్ పీఎఫ్ లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తుండటంతో అతని భార్య గీతాకు స్థానికులు మంచి మర్యాద, గౌరవం ఇస్తున్నారు. మణిపూర్ లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఇంద్రపాల్ ఆ రాష్ట్రానికి వెళ్లాడు. కొన్ని రోజుల నుంచి మణిపూర్ లో విధులు నిర్వహిస్తున్న ఇంద్రపాల్ అతని భార్య గీతాతో పాటు ఇద్దరు పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.

శవమై కనిపించిన భార్య
రెండు రోజుల క్రితం మణిపూర్ లో ఉన్న సీఆర్ పీఎఫ్ అధికారి ఇంద్రపాల్ అతని భార్య గీతాకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య గీతా ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వారికి, స్థానిక పోలీసులకు ఇంద్రపాల్ సమాచారం ఇచ్చాడు. తన ఇంటి దగ్గరక వెళ్లి చూడాలని ఇంద్రపాల్ వారికి మనవి చేశాడు. పోలీసులు గాలించగా సీఆర్ పీఎఫ్ అధికారి ఇంద్రపాల్ భార్య గీతా డ్రైనేజ్ లో శవమై కనిపించింది.

కారు మెకానిక్ తో అక్రమ సంబంధం
సీఆర్ పీఎఫ్ అధికారి ఇంద్రపాల్ భార్య గీతాను గొంతునులిమి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సీఆర్ పీఎఫ్ అధికారి ఇంద్రపాల్ భార్య గీతా చివరిసారిగా కారు మెకానిక్ ముక్తార్ అనే వ్యక్తితో మాట్లాడిందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్ పీఎఫ్ అధికారి ఇంద్రపాల్ భార్య గీతాకు, కారు మెకానిక్ ముక్తార్ కు చాలాకాలంగా అక్రమ సంబంధం ఉన్న విషయం పోలీసుల విచారణలో బయటకు వచ్చింది.

భర్త డ్యూటీకి వెలితే ప్రియుడితో భార్య షికార్లు తిరిగింది
గీతా నివాసం ఉంటున్న ఏరియాలోనే కారు మెకానిక్ ముక్తార్ కూడా నివాసం ఉంటున్నాడని పోలీసులు అన్నారు. చాలాకాలంగా గీతా, కారు మెకానిక్ ముక్తార్ కు అక్రమ సంబంధం ఉందని, ఇంద్రపాల్ డ్యూటీకి వెళ్లిన తరువాత గీతా ఆమె ప్రియుడు ముక్తార్ తో కలిసి షికార్తు తిరిగేదని పోలీసు అధికారులు అంటున్నారు.

నేనే కాకుండా కిలాడీ లేడీకి మరో ప్రియుడు ఉన్నాడు
తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న గీతా తన కళ్లుకప్పి మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆ విషయంలో మా మద్య గొడవలు మొదలైనాయని కారు మెకానిక్ ముక్తార్ పోలీసులకు చెప్పాడు. తనను మోసం చేసిందని కక్షతో గీతాను కారులో పిలుచుకుని వెళ్లి ఆమె గొంతు నులిమి చంపేశానని, గీతా శవాన్ని డ్రైనేజ్ లో విసిరేశానని ముక్తార్ విచారణలో అంగీకరించాడని పోలీసు అధికారులు అన్నారు.

రెండో ప్రియుడికి ఏమైనా ?
అయితే కారు మెకానిక్ ముక్తార్ తో పాటు మరో ఇద్దరు కలిసి గీతాను గొంతు నులిమి చంపేసి ఉంటారని అనుమానం ఉందని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. గీతా రెండో ప్రియుడికి ఈ కేసులో ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications