Illegal affair: ఒకే కంపెనీలో భర్త, భార్య, ఆమె ప్రియుడు, ఫోన్ లో అసలు మ్యాటర్ ?, మిస్సింగ్ కేసు పెట్టిన భర్త !

చెన్నై/రాణిపేట్/వేలూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం ప్రేమించుకున్న ప్రేమికులు తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు ఒకేచోట ఉద్యోగాలు చేస్తూ తరువాత పెళ్లి చేసుకోవడంతో మొదట్లో వారి సంసారం చాలాహ్యాపీగా సాగిపోయింది. తరువాత భార్య అక్రమ సంబంధం విషయంలో ఆమె భర్త గొడవలు పడటం మొదలుపెట్టాడు. తన భార్య కనపడటం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాయం అయిన మహిళ కోసం గాలించడం మొదలుపెట్టారు. దంపతులు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఇంటి ఆవరణంలోని బావిలోనే కనపడకుండా పోయిన మహిళ శవమై కనిపించడంతో మ్యాటర్ మొత్తం బయటకు రావడం కలకలం రేపింది.

 ఒకేచోట ఉద్యోగం

ఒకేచోట ఉద్యోగం

కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన రాము (40) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులోని రాణిపేట్ జిల్లాక చేరుకుని పెరుమూహలోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడు. ఇదే ఫ్యాక్టరీలో సరిత (37) అనే మహిళ ఉద్యోగం చేస్తోంది. ఒకే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న రాము, సరితకు పరిచయం అయ్యింది.

లవ్ మ్యారేజ్ తో హ్యాపీలైఫ్

లవ్ మ్యారేజ్ తో హ్యాపీలైఫ్


స్నేహితులుగా ఉన్న సరిత, రాము తరువాత ప్రేమలోపడ్డారు. 10 సంవత్సరాలు ప్రేమించుకున్న రాము, సరిత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొంతకాలం ప్రేమించుకున్న ప్రేమికులు సరిత, రాము లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సరిత, రాము దంపతులు మూడు సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

ఫ్యాక్టరీలో సాటి ఉద్యోగితో భార్య ?

ఫ్యాక్టరీలో సాటి ఉద్యోగితో భార్య ?


రాము, సరిత దంపతులు ఒకేచోట ఉద్యోగాలు చేస్తూ తరువాత పెళ్లి చేసుకోవడంతో మొదట్లో వారి సంసారం చాలాహ్యాపీగా సాగిపోయింది. సరిత, రాము దంపతులకు కొడుకు పుట్టిన కొన్ని నెలలకే బాబు చనిపోయాడు. కొడుకు చనిపోయాడని రాము భాదలో ఉన్నాడు. ఇదే సమయంలో ఉద్యోగం చేస్తున్న లెదర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఓ వ్యక్తితో సరితో చనువుగా ఉండటం మొదలుపెట్టిందని తెలిసింది.

 భార్యతో గొడవలు

భార్యతో గొడవలు

కొంతకాలం నుంచి రాము, సరిత దంపతులు వేరేవేరు షిఫ్ట్ ల్లో ఉద్యోగాలకు వెలుతున్నారు. వేర్వేరు సమాయాల్లో ఉద్యోగాలు చేస్తుండటం, ఇంటి వచ్చిన తరువాత కూడా సరిత మొబైల్ ఫోన్ లో బయట వ్యక్తితో ఎక్కువగా మాట్లాడటంతో ఆమె భర్త రాముకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో రాము, సరిత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

బార్యకు అక్రమ సంబంధం ?

బార్యకు అక్రమ సంబంధం ?

భర్త రామును ఏమాత్రం పట్టించుకోకుండా సరిత ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. భార్య సరిత అక్రమ సంబంధం విషయంలో రాము ఆమెతో గొడవలు పడుతూ ఆమె మీద రగిలిపోయాడు. చివరికి సహనం కోల్పోయిన రాము అతని భార్య సరితను హత్య చేసి ఆమె శవాన్ని ఇంటి ఆవరణంలోని బావిలో విసిరేసి చేతులు దులుపుకున్నాడు.

కేసు పెట్టి డ్రామాలు ఆడిన భర్త

కేసు పెట్టి డ్రామాలు ఆడిన భర్త

సరితను హత్య చేసిన మరుసటి రోజు తన భార్య కనపడటం లేదని రాము రత్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాయం అయిన సరిత కోసం గాలించడం మొదలుపెట్టారు. పోలీసులతో పాటు రాము కూడా అతని భార్య సరిత కోసం గాలించినట్లు నటించడం మొదలు పెట్టాడు. రాము మీద రెండు రోజులు పోలీసులకు అనుమానం రాలేదు.

బావిలో భార్య శవం కుళ్లిపోయి ?

బావిలో భార్య శవం కుళ్లిపోయి ?

రాము, సరిత దంపతులు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాము ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఇంటి ఆవరణంలోని బావిలోనే కనపడకుండా పోయిన సరిత శవం కుళ్లిపోయి కనిపించింది. సరిత శవం బయటకు తీసిన పోలీసులు చిత్తూరు సమీపంలోని వేలూరు ఆసుపత్రికి తరలించారు.

భర్త స్కెచ్ రివర్స్..... మ్యాటర్ క్లోజ్

భర్త స్కెచ్ రివర్స్..... మ్యాటర్ క్లోజ్

పోలీసులు రామును అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తన భార్య సరిత వేరే వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేశానని రాము అంగీకరించాడని పోలీసులు అన్నారు. రాముకు బెండ్ తీస్తే అతని భార్య సరిత అసలు మ్యాటర్ మొత్తం బయటకు రావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+