Illegal affair: భర్త ఆటో డ్రైవర్, భర్త బయట రైట్ రైట్, ఇంట్లో భార్య ?, గడ్డపారతో ఏం చేశాడంటే ?!
జైపూర్/ రాజస్థాన్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ అనుకున్నారు. భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఉదయం నుంచి రోడ్డు మీద ఆటోలు బాడుగలు తిప్పుతున్నాడు. ఇంట్లో అతని భార్య ఒంటరిగా ఉంటోంది. రానురాను భార్య మీద ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య ప్రవర్తనలో తేడాలు రావడంతో భర్తకు ఇంకా అనుమానం మొదలైయ్యింది. రాత్రి ఇంటికి వెళ్లిన ఆటో డ్రైవర్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ దంపతులు ఒకరి మీద ఒకరు రెచ్చిపోయారు. సహనం కోల్పోయిన భర్త అతని భార్యను చంపేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.

దంపతుల హ్యాపీలైఫ్
రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లాలోని రాగ్రా గ్రామంలో జితేంద్ర బరందా అలియాస్ జితేంద్ర (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన అనితా (25) అనే పెళ్లి చేసుకున్న జితేంద్ర ఆమెతో ప్రత్యేకంగా కాపురం పెట్టారు. జితేంద్ర, అనితా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

భర్త ఆటో డ్రైవర్
జితేంద్ర, అనితా దంపతులు చూడముచ్చటగా ఉన్నారని, చిలకా గోరింకల్లా ఉన్నారని వాళ్ల బంధువులు అందరూ ముచ్చటపడ్డారు. జితేంద్ర ముందు నుంచి ఆటో డ్రైవర్ కావడంతో ఉదయం నుంచి రోడ్డు మీద ఆటోలు బాడుగలు తిప్పుతున్నాడు. ఇంట్లో జితేంద్ర భార్య అనితా ఒంటరిగా ఉంటోంది. జితేంద్ర ఎక్కువగా బయట ఉంటున్నాడు.

ఆటో డ్రైవర్ కు భార్య మీద అనుమానం
ఆటో డ్రైవర్ జితేంద్రకు రానురాను అతని భార్య అనితా మీద అనుమానం మొదలైయ్యింది. నేను బయటకు వెళ్లిన తరువాత నువ్వు ఎంతసేపు బయట తిరుగుతున్నావు ?, ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నావు ? అంటూ జితేంద్ర అతని భార్య అనితాతో గొడవపడటం మొదలుపెట్టాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

గడ్డపారతో భార్య మీద దాడి
అనితా ప్రవర్తనలో తేడాలు రావడంతో ఆమె భర్త జితేంద్రకు ఇంకా అనుమానం మొదలైయ్యింది. రాత్రి ఇంటికి వెళ్లిన ఆటో డ్రైవర్ జితేంద్ర అతని భార్య అనితాతో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ అనితా, జితేంద్ర దంపతులు ఒకరి మీద ఒకరు రెచ్చిపోయారు. సహనం కోల్పోయిన జితేంద్ర పదునైన గడ్డపార తీసుకుని అతని భార్య అనితా మీద దాడి చేశాడు.

పోలీసులకు భార్య స్టోరీ మొత్తం చెప్పిన భర్త
భార్య అనితా మీద దాడి చేసిన తరువాత జితేంద్ర నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. పోలీసులు వెంటనే ఇంటికి వెళ్లి అనితాను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అనితా చనిపోయిందని వైద్యులు చెప్పారు. తన భార్య అనితా అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేశానని జితేంద్ర అంగీకరించాడని డిప్యూటీ పోలీసు కమీషనర్ రాకేష్ శర్మా మీడియాకు చెప్పారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications