Illegal affair: లవ్ మ్యారేజ్, భార్య మీద డౌట్, రాత్రి ఏం జరిగిదంటే ?, బెడ్ మీద భార్య గొంతు కోసి చంపేసిన భర్త!
గోవా/పణజి: ఒకే ప్రాంతంలో పని చేస్తున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో రెండు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. నేను బయటకు వెళ్లిన తరువాత తన భార్య కోసం ఎవరో వచ్చి వెలుతున్నారని భర్తకు అనుమానం మొదలైయ్యింది.
ఇదే విషయంలో దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, తనకు అన్యాం చేసిందని భర్త రగిలిపోయాడు. చివరికి భర్త అతని భార్య గొంతు కోసి ఆమెను స్పాట్ లో చంపేసి చేతులు దులుపుకున్నాడు.

గోవాలో పరిచయం
ఒడిశాకు చెందిన రాజ్ కుమార్ నాయక్ అలియాస్ రాజ్ కుమార్ (30) అనే యువకుడు గోవా చేరుకుని పోండా తాలుకాలోని భట్వాడి-షిరోడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రీటా (24) అనే యువతి రాజ్ కుమార్ కు పరిచయం అయ్యింది. రాజ్ కుమార్, రీటా ఒకే చోట పని చేస్తుండటంతో రోజు కలుస్తున్నారు.

లవ్ మ్యారేజ్ తో?
రాజ్ కుమార్, రీటా ఇద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న రాజ్ కుమార్, రీటా పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న రాజ్ కుమార్ అతని భార్య రీటాతో రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశాడు.

భార్య మీద అనుమానం
రీటా త్వరగా పని ముగించుకుని ఇంటికి వచ్చేస్తోంది. రాజ్ కుమార్ పని ముగించుకుని లేటుగా ఇంటికి చేరుకుంటున్నాడు. రాజ్ కుమార్ కంటే కొన్ని గంటలు ముందుగా ఇంటికి వస్తున్న రీటా ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. నేను బయటకు వెళ్లిన తరువాత తన భార్య రీటా కోసం ఎవరో వచ్చి వెలుతున్నారని ఆమో భర్త రాజ్ కుమార్ కు అనుమానం మొదలైయ్యింది.

భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం
ఇదే విషయంలో రాజ్ కుమార్, రీటా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్య రీటా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, తనకు అన్యాం చేసిందని రాజ్ కుమార్ రగిలిపోయాడు. ఆదివారం రాత్రి ఇదే విషయంలో రాజ్ కుమార్, రీటా దంపతులు గొడవ పడుతున్న విషయం చుట్టుపక్కల వాళ్లు గమనించారు.

భార్య గొంతు కోసి చంపేసిన భర్త
ఆదివారం చుట్టుపక్కల వాళ్లు రాజ్ కుమార్ ను మందలించారు. తరువాత రాజ్ కుమార్ సైటెంట్ అయిపోయాడు. చివరికి కొన్ని గంటల తరువాత రాజ్ కుమార్ అతని భార్య రీటా గొంతు కోసి ఆమెను స్పాట్ లో చంపేసి చేతులు దులుపుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. 7 సంవత్సరాల క్రితం గోవా చేరుకున్న రాజ్ కుమార్ మద్యం సేవించడానికి అలవాటుపడ్డాడని, భార్య రీటాను తానే హత్య చేశానని అతను అంగీకరించాడని దక్షిణ గోవా ఎస్పీ అభిషేక్ దానియా మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications