Illegal affair: ఆంటీని నమ్ముకుని భార్యను తరిమేశాడు, మోజు తీరిందని హ్యాండ్ ఇచ్చింది, చివరికి !

చెన్నై/ తిరుప్పూర్: ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని భార్యను పూర్తిగా నిర్లక్షం చేశాడు. ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న తనకు భార్య ఎందుకులే అనుకున్నాడు. భర్తకు బుద్దిమాటలు చెప్పిచెప్పి విసిగిపోయిన భార్య భర్తకు టాటా చెప్పేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆంటీని నమ్ముకుని భార్యకు పూర్తిగా దూరం అయిన భర్త తన ప్రియురాలే ప్రపంచం అని మురిసిపోయాడు. రానురాను పోటుగాడితో మోజు తీరిపోవడంతో ఆంటీ కూడా అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించింది. భార్య పుట్టింటికి వెళ్లి పోవడం, ఆంటీ కూడా దూరం కావడానికి ప్రయత్నించడంతో అతను రగిలిపోయాడు. ప్రియురాలి ఇంటి ముందుకు వెళ్లిన ప్రియుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు. గ్రహాలు రివర్స్ కావడంతో మంటలు వ్యాపించి అతను కాలిపోయాడు. వారం రోజులు ఐసీయూలో చికిత్స పొందిన ప్రియుడు చివరికి ప్రాణాలు వదిలేశాడు.

 మాణిక్యం కాపురం

మాణిక్యం కాపురం

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని పెరియూర్ పల్లడంలోని ఉరుమలై ప్రాంతంలో మాణిక్యం (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మాణి్క్యంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరోజా ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మాణిక్యం అతని భార్యను పూర్తిగా నిర్లక్షం చేశాడు. ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న తనకు భార్య ఎందుకులే అనుకున్నాడు. భర్తకు బుద్దిమాటలు చెప్పిచెప్పి విసిగిపోయిన భార్య భర్తకు టాటా చెప్పేసి ఆమె నాలుగు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

 భార్యకు పూర్తిగా దూరం అయిన భర్త

భార్యకు పూర్తిగా దూరం అయిన భర్త

సరోజా ఆంటీని నమ్ముకుని భార్యకు పూర్తిగా దూరం అయిన భర్త మాణిక్యం తన ప్రియురాలే ప్రపంచం అని మురిసిపోయాడు. భార్య, భర్తలను రాజీ చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు అనేకసార్లు ప్రయత్నించారు. అయితే మాణిక్యం ఎవ్వరిమాట వినకుండా అతను సరోజా మైకంలో పడిపోయాడు. మేస్త్రీ పని చేస్తున్న మాణిక్యం సంపాధిస్తున్న డబ్బులు మొత్తం ప్రియురాలికి ఇస్తూ అతను మద్యం తాగి ఎంజాయ్ చేస్తున్నాడు.

 హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

రానురాను పోటుగాడి మాణిక్యం మీద మోజు తీరిపోవడంతో సరోజా ఆంటీ కూడా అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించింది. ఇదే విషయంలో మాణిక్యం, సరోజా మద్య గొడవలు జరుగుతున్నాయి. మాణిక్యంకు తెలిసవాళ్లు సరోజాతో అతను కలసి ఉండేలా చెయ్యాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పటికే భర్తను వదిలేసిన సరోజా ఇప్పుడు మాణిక్యంను కూడా వదిలేయాలని డిసైడ్ అయ్యిందని సమాచారం.

 బెదిరించాలని ప్రయత్నించిన ప్రియుడు

బెదిరించాలని ప్రయత్నించిన ప్రియుడు

భార్య పుట్టింటికి వెళ్లి పోవడం, సరోజా కూడా దూరం కావడానికి ప్రయత్నించడంతో మాణిక్యం రగిలిపోయాడు. ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రియురాలు సరోజా ఇంటి ముందుకు వెళ్లిన ఆమె ప్రియుడు మాణిక్యం అతని శరీరం మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆమెను బెదరించడానికి ప్రయత్నించాడు. గ్రహాలు రివర్స్ కావడంతో మాణిక్యంకు మంటలు వ్యాపించి అతను నడిరోడ్డు మీద పరగులు తీశాడు.

 ప్రియుడి ప్రాణం పోయింది

ప్రియుడి ప్రాణం పోయింది

మంటలు వ్యాపించి నడిరోడ్డు మీద పరుగులు తీస్తున్న మాణిక్యం మీద స్థానికులు నీళ్లు చల్లి మంటలు అదుపు చేసి అతని వెంటనే అంబులెన్స్ లో పల్లడం ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎక్కువగా వ్యాపించి కాలిపోవడంతో తరువాత మాణిక్యంను తిరుప్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూకి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న మాణిక్యం చికిత్స విఫలమై మరణించాడని పోలీసులు తెలిపారు. ప్రియురాలి కోసం నిప్పంటించుకుని మాణిక్యం ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+