Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: అందంగా రెడీ అయిన భార్య, ఫస్ట్ ఇల్లు మార్చాడు, తరువాత షూ లేస్ తో భార్యను !

సూరత్/ ముంబాయి/ చెనై: సంతోషంగా భార్యతో కాపురం చేస్తున్న భర్త అప్పుడప్పుడు ఆమెను బయటకు పిలుచుకుని వెలుతున్నాడు. ఉదయం నిద్రలేచి బయటకు వెలుతున్న భర్త రాత్రి పని ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. పగలంతా భార్య ఇంటిలోనే ఉంటున్నది. తాను బయటకు వెళ్లిన తరువాత తన భార్య మొబైల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నదని, నేను ఇంటికి వచ్చిన తరువాత భార్య ఏమీ తెలీనట్లు ఉంటుందని భర్తకు అనుమానం వచ్చింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనను నిర్లక్షం చేస్తోందని, ప్రతిరోజు రాత్రి అందంగా రెఢీ అవుతోందని రానురాను భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇక లాభం లేదని రెండు నెలల క్రితం భర్త అతను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరే చోట కాపురం పెట్టాడు. ఇంటిని వేరే చోటకు మార్చినా దంపతుల మద్య గొడవలు అలాగే జరుగుతున్నాయి. రాత్రి ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త షూ లేస్ లు తీసుకుని అతని భార్య గొంతు బిగించి చంపేశాడు. తరువాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో భార్య శరీరం మీద కిరోసిన్ పోసిన భర్త ఆమె శవానికి నిప్పంటించాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి ప్రయత్నించిన భర్త ఇంటి బయట తాళం వేసుకుని పరారైనాడు. భార్యను చంపేసి పారిపోయిన భర్తకు అన్ని గ్రహాలు రివర్స్ కావడం, రైలు తిగిన వెంటనే ఎదురుగా పోలీసులు ఉండటంతో హడలిపోయారు. భార్యను చంపేసిన భర్తకు ఇప్పుడు పోలీసులు బడిత పూజ చేశారు.

మహారాష్ట్ర మొగుడు..... బీహార్ భార్య

మహారాష్ట్ర మొగుడు..... బీహార్ భార్య

మహారాష్ట్రకు చెందిన సూరజ్ ఆనంద్ ఖరత్ అలియాస్ సూరజ్ (26) అనే యువకుడు రెండు సంవత్సరాల క్రితం బీహార్ కు చెందిన సుశీల సాహెబ్రావ్ నికల్జే అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇరు వైపుల కుటుంబ సభ్యుల అంగీకారంతోనే అప్పట్లో సూరజ్, సుశీల వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన సంవత్సరం పాటు సూరజ్, సుశీల దంపతులు చాలా సంతోషంగా జీవనం సాగించారని సమాచారం.

క్యాటరింగ్ పని చేస్తున్న భర్త

క్యాటరింగ్ పని చేస్తున్న భర్త

సంతోషంగా భార్య సుశీలతో కాపురం చేస్తున్న భర్త సూరజ్ అప్పుడప్పుడు ఆమెను బయటకు పిలుచుకుని వెలుతున్నాడు. సూరజ్ క్యాటరింగ్ పని చేస్తూ అతని భార్య సుశీల పోషిస్తున్నాడు. ఉదయం నిద్రలేచి బయటకు వెలుతున్న భర్త సూరజ్ రాత్రి పని ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. పగలంతా సూరజ్ భార్య సుశీల ఇంటిలోనే ఉంటున్నది.

భర్తకు ఒక్కొసారి నైట్ డ్యూటీలు

భర్తకు ఒక్కొసారి నైట్ డ్యూటీలు

క్యాటరింగ్ ఆర్డర్లు రాత్రి వచ్చే టైమ్ లో సూరజ్ పని ముగించుకుని అర్దరాత్రి ఇంటికి వెళ్లేవాడు. భర్త సూరజ్ రాత్రి లేటుగా వెలుతున్న సమయంలో భర్త సుశీల అందంగా రెఢీ అయ్యి నిద్రమేలుకుని ఉండటంతో అతనికి రానురాను అనుమానం మొదలైయ్యింది. తాను బయటకు వెళ్లిన తరువాత తన భార్య సుశీల మొబైల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నదని, రాత్రి నేను వెళ్లే వరకు ఆమె ఎందుకు నిద్రమేలుకుని ఉంటుందని, నేను ఇంటికి వచ్చిన తరువాత భార్య ఏమీ తెలీనట్లు ఉంటుందని ఆమె భర్త సూరజ్ కు అనుమానం మొదలైయ్యింది.

భార్య మీద అనుమానంతో ఇల్లు ఖాళీ చేసిన భర్త

భార్య మీద అనుమానంతో ఇల్లు ఖాళీ చేసిన భర్త

తన భార్య సుశీల మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనను నిర్లక్షం చేస్తోందని రానురాను భర్త సూరజ్ కు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో సూరజ్, సుశీల దంపతుల మద్య గొడవ ఎక్కువ అయ్యింది. ఇక లాభం లేదని రెండు నెలల క్రితం సూరజ్ అతను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరే చోట కాపురం పెట్టి నా భార్య సుశీలను కాపాడుకోవాలని అనుకున్నాడని సమాచారం.

కొత్త ఇంటిలో అందంగా రెఢీ అవుతున్న భార్య ?

కొత్త ఇంటిలో అందంగా రెఢీ అవుతున్న భార్య ?

కొత్త ఇంటిలోకి మారిన తరువాత సూరజ్ భార్య సుశీల ఇంకా అందంగా తయారౌతున్నదని తెలిసింది. కాపురం వేరే చోటకు మార్చినా సూరజ్, సుశీల దంతుల మద్య గొడవలు అలాగే జరుగుతున్నాయి. నువ్వు ఎందుకు అందంగా రెఢీ అవుతున్నావని భర్త సూరజ్ ప్రశ్నిస్తే నీ కోసమే అంటూ భార్య సుశీల సమాధానం ఇచ్చింది. అయితే సూరజ్ కు మాత్రం అతని భార్య మీద అనుమానం తగ్గలేదు. రాత్రి సూరజ్, సుశీల మద్య ఇదే విషయంలో గొడవలు మొదలైనాయి.

కొత్త కాపురం..... సమాచారం తెలీదు

కొత్త కాపురం..... సమాచారం తెలీదు

ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట హత్యకు గురైన సుశీల విషయం తెలుసుకోవడానికి చాల శ్రమించారు. చివరికి ఆ ఇంటిలో కాపురం ఉంటున్నది సూరజ్, సుశీల దంపతులు అని ఓ మహిళ మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇదే సమయంలో ఆమె సూరజ్ మొబైల్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

రైలు దిగిన భర్త..... ఎదురుగా పోలీసుల దర్శనం

రైలు దిగిన భర్త..... ఎదురుగా పోలీసుల దర్శనం

భార్య సుశీలను హత్య చేసిన తరువాత సూరజ్ థానేలో రైలు ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడు. భార్య సుశీలను చంపేసి పారిపోయిన భర్తకు అన్ని గ్రహాలు రివర్స్ అయ్యాయి. రైలులో బుద్లాపూర్ లోని కమ్ నగర్ రైల్వే స్టేషన్ లో రైలు దిగుతున్న సూరజ్ ఎదురుగా పోలీసులు ఉండటంతో హడలిపోయారు. భార్య సుశీలను చంపేసిన భర్త సూరజ్ కు ఇప్పుడు పోలీసులు బడిత పూజ చేశారు. తన భార్య సుశీల అక్రమ సంబంధం పెట్టుకోవడం వలనే తాను హత్య చేశానని ఆమె భర్త సూరజ్ ఆనంద్ అంగీకరించాడని థానే పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+