Illegal affair: రాత్రి కారులో ప్రియుడితో భార్య రొమాన్స్, భర్త వీడియో కాల్ చేశాడు, కట్ చేస్తే !

చెన్నై/ మదురై/ పెరంబదూర్: భార్యతో సంతోషంగా కాపురం చేసిన భర్త ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్య, పిల్లలు సుఖంగా ఉండాలని భర్త పొరుగు రాష్ట్రంలో పని చేస్తున్నాడు. ఇదే సమయంలో భార్య ఓ యువకుడిని తగులుకుంది. భర్త వేరే ఊరిలో ఉండటం, ఇంట్లో అత్తమామలు ఎవ్వరూ లేకపోవడంతో అడిగేవారు కరువైనారు. ఇక అంతే ప్రియుడితో కలిసి భార్య రాత్రిపగలు అనితేడా లేకుండా కారులో ఎక్కడపడితే అక్కడకు వెళ్లి ఎంజాయ్ చేసింది. ఓ రోజు రాత్రి 10 గంటల సమయంలో భర్త తన భార్యతో మాట్లాడాలని వీడియో కాల్ చేశాడు. ఆ సమయంలో కారులో ప్రియుడితో కలిసి భార్య మంచి రసపట్టులో ఉంది. ఫోన్ ఎత్తితే ఎక్కడ తన బండారం బయటపడుతుందో అంటూ భయపడిన భార్య నెక్ట్స్ సీన్ ను పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

 ఊరిలో భార్య.....కేరళలో భర్త

ఊరిలో భార్య.....కేరళలో భర్త

తమిళనాడులోని పెరంబూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న సెల్వరాజ్, జ్యోతిచిత్ర (37) దంపతులు (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నారు. సెల్వరాజ్, జ్యోతిచిత్ర దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని భావించిన సెల్వరాజ్ కేరళ వెళ్లి కష్టపడి పెరంబూరులో ఉన్న భార్య జ్యోతిచిత్రకు పంపిస్తున్నాడు.

 మేడమ్ ను లైన్ లో పెట్టిన అరుణ్

మేడమ్ ను లైన్ లో పెట్టిన అరుణ్

పెరంబూరులో అరుణ్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అరుణ్ సొంతంగా కారు కొనుగోలు చేసి బాడుగలకు తిప్పుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు. జోత్యిచిత్రకు అరుణ్ కు పరిచయం ఉంది. జ్యోతిచిత్ర భర్త కేరళలో ఉంటున్నాడని, ఒంటరిగా ఉంటున్న ఆంటీని లైన్ లో పెట్టాలని అరుణ్ ప్రయత్నించాడు.

 ప్రియుడితో ఎంజాయ్ చేస్తే అడిగే దిక్కులేదు

ప్రియుడితో ఎంజాయ్ చేస్తే అడిగే దిక్కులేదు

జ్యోతిచిత్ర, ఆమె పిల్లలు మాత్రమే పెరంబూరు ఇంటిలో ఉంటున్నారు. సెల్వరాజ్ తల్లిదండ్రులు కాని, అన్నతమ్ముళ్లు కానీ ఎవ్వరూ లేకపోవడం అడిగే దిక్కులేదని జ్యోతిచిత్ర ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైయ్యింది. ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలేసి ఎప్పుడు పడితే అప్పుడు ప్రియుడు అరుణ్ తో కలిసి కారులో షికార్లకు వెళ్లి పిచ్చపాటిగా అతనితో ఎంజాయ్ చేస్తున్న జ్యోతిచిత్ర ఆమె భర్తలేని లోటు తీర్చుకుంటున్నది.

 అర్దరాత్రి పోలీసులకు సినిమా

అర్దరాత్రి పోలీసులకు సినిమా

రాత్రి 11. 30 గంటల సమయంలో జోతిచిత్ర పెరంబూరులోని మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తాను ఇంటికి వెలుతున్న సమయంలో ఐదు మంది వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి కదులుతున్న కారులోనే తన మీద అత్యాచారం చేశారని, ఈ విషయం బయటకు చెబితే నిన్ను, నీ పిల్లలను చంపేస్తామని వారు బెదిరించారని జోతిచిత్ర పోలీసులకు చెప్పింది. మొదట జ్యోతిచిత్ర చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. అయ్యో పాపం అంటూ జ్యోతిచిత్ర మీద పెరంబూరు మహిళా పోలీసులు జాలి చూపించారు.

 అరుణ్ అరెస్టుతో సీన్ రివర్స్

అరుణ్ అరెస్టుతో సీన్ రివర్స్

జోతిచిత్ర చెప్పిన వివరాలకు దర్యాప్తులో తేలిన వివరాలకు ఎలాంటి పొంతనలేపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ట్రీట్ మెంట్ ఇవ్వడంతో జ్యోతిచిత్ర నోటి నుంచి అరుణ్ పేరు బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు అరుణ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. తాను ఒక్కడే జోతిచిత్రతో కారులో లో ఎంజాయ్ చేశానని, తనతోపాటు మరెవ్వరు లేరని, ఆమె ఇష్టప్రకారమే తనతో తిరుగుతోందని అరుణ్ పోలీసులకు చెప్పాడు.

 భర్త వీడియో కాల్ చేశాడని డ్రామా

భర్త వీడియో కాల్ చేశాడని డ్రామా

జ్యోతిచిత్ర తన మీద రేప్ జరిగింది అని పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజు రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు కేరళలోని భర్త సెల్వరాజ్ ఫోన్ చేశాడు. ఆ రోజు జ్యోతిచిత్ర, అరుణ్ కారులో పెరంబూరు పట్టణం శివార్లలో కారులోనే ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే తాను ఇంట్లో లేనని తెలిసిపోతుందని, తరువాత తన భర్త ఇంత రాత్రిలో నువ్వు బయట ఎమి చేస్తున్నావ్ ? అంటూ నిలదీస్తాడని, నా కాపురం కూలిపోతుందని జ్యోతిచిత్ర భయపడింది. భర్త సెల్వరాజ్ పోరు తప్పించుకోవడానికి జ్యోతిచిత్ర తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని పోలీస్ స్టేషన్ కు వచ్చి డ్రామాలు వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    India-China Stand Off : China ను దెబ్బ తీసేలా LAC వద్ద Nirbhay Missile ‌ను మోహరించిన భారత్!
     మేమే చిక్కామా...... మేము ఏమైనా బకరాలమా ?

    మేమే చిక్కామా...... మేము ఏమైనా బకరాలమా ?

    అర్దరాత్రి మాతోనే గేమ్స్ ఆడుతావా ? అర్దరాత్రి మేమే చిక్కామా ? మేము ఏమైనా బకరాలా అంటూ పోలీసులు కిలాడీ లేడీ జ్యోతిచిత్ర మీద మండిపడి సరైన ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇంత డ్రామాకు కారణం అయిన అరుణ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జ్యోతిచిత్ర భర్త సెల్వరాజ్ ను పెరంబూరుకు పిలిపించి అతని ముందే జ్యోతిచిత్రకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే మోసం చెయ్యడానికి ప్రయత్నించిందని జ్యోతిచిత్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+