Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: క్లోజ్ ఫ్రెండ్స్, భర్త ఫ్రెండ్ తో ?, పోయేది ఏముందని కిలాడీ గ్రీన్ సిగ్నల్, క్లైమాక్స్ లో !

బెంగళూరు/చెన్నై/ సేలం: వ్యాపారం చేస్తున్న స్నేహితులు హ్యాపీగా రోజూ కలుస్తున్నారు. స్నేహితులు వారి భార్యలతో కలిసి ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్నారు. ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్న సమయంలో ఓ స్నేహితుడు అతని ఫ్రెండ్ భార్య మీద కన్ను వేశాడు. భర్త ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తే ఏం పోతుంది అనుకున్న అతని భార్య కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలం ఫ్రెండ్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న ఫ్రెండ్ అతని భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల ఫ్రెండ్ భ్యాతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కారు కొనుగోలు చెయ్యాలని అనుకున్నాడు. తాను బెంగళూరులో ఎస్ యూవీ కారు కొనుగోలు చేసుకుని వస్తానని అతని భార్యకు చెప్పి బయలుదేరాడు. అంతే ఆ రోజు రాత్రి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు రోజులు అయినా భర్త ఆచూకి లేకపోవడంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పోలీసులు అందరిని సంప్రధించారు. బెంగళూరు శివార్లలోని చెరువులో కారు కొనడానికి వెళ్లిన యువకుడు శవమై కనిపించాడు. అక్రమ సంబంధం కారణంగా అతన్ని ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

 చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్

చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్

తమిళనాడులోని సేలంలోని తారామంగళం సమీపంలోని ఎంజీఆర్ కాలనీలోలోని సమతువపురంలో రమేష్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతనికి సొంతంగా కార్లు ఉన్నాయి. కార్లు అద్దెకు ఇస్తున్న రమేష్ బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. తారాపురంలో శేఖర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రమేష్, శేఖర్ చిన్ననాటి స్నేహితులు. ఎవరి ఇంట్లో శుభకార్యాం జరిగినా ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్నారు.

 ఫ్రెండ్ భార్య మీద కన్ను పడింది

ఫ్రెండ్ భార్య మీద కన్ను పడింది

రమేష్ కు వెనీలా (25) అనే యువతితో వివాహం అయ్యింది. రమేష్ అతని భార్య వెనీలాతో సంతోషంగా ఉండేవాడు. శేఖర్ కు స్వరూప (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం అయ్యింది. రమేష్ అతని భార్య వెనీలాను పిలుచుకుని శేఖర్ ఇంటికి వెళ్లి వస్తున్నాడు. శేఖర్ కూడా అతని భార్య స్వరూపాను పిలుచుకుని రమేష్ ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇదే సమయంలో క్లోజ్ ఫ్రెండ్ శేఖర్ భార్య స్వరూపా మీద రమేష్ కన్నుపడింది.

 భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం

భర్త ఫ్రెండ్ తో అక్రమ సంబంధం

ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్న సమయంలో రమేష్ అతని స్నేహితుడు శేఖర్ భార్య స్వరూపా మీద కన్ను వేశాడు. భర్త శేఖర్ ఫ్రెండ్ రమేష్ తో ఎంజాయ్ చేస్తే ఏం పోతుంది అనుకున్న స్వరూపా కూడా రమేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరువాత రమేష్ అతని ఫ్రెండ్ శేఖర్ భార్య స్వరూపాతో చనువు పెంచుకున్నాడు.

 టైమ్ చూసి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు

టైమ్ చూసి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు

చాలా కాలం ఫ్రెండ్ శేఖర్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న రమేష్ అతని భార్య స్వరూపాతో ఎంజాయ్ చేస్తున్నాడు. శేఖర్ ఎక్కడకు వెళ్లినా ఆ విషయం ముందుగా తెలుసుకుంటున్న రమేష్ పక్కాప్లాన్ తో అతనికి ఇంటికి వెళ్లి అతని భార్య స్వరూపాతో కాలం గడిపి అతని కోరిక తీర్చుకుని సైలెంట్ గా చెక్కేస్తున్నాడు.

 భర్త మైండ్ బ్లాక్

భర్త మైండ్ బ్లాక్

చాలాకాలం రమేష్, శేఖర్ భార్య స్వరూపా అక్రమ సంబంధం సీక్రేట్ గా సాగిపోయింది. శేఖర్ ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న అతని స్నేహితుడికి అనుమానం వచ్చి కొన్ని రోజులు రమేష్ మీద నిఘా వేశాడు. తరువాత శేఖర్ భార్య స్వరూపా, రమేష్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న స్నేహితుడు శేఖర్ కు సమాచారం ఇచ్చాడు. రమేష్ ను ప్రాణ స్నేహితుడు అని నమ్మినందుకు తనకే ద్రోహం చేస్తాడా ?, వీడి అంతు చూడాలని శేఖర్ రగిలిపోయాడు.

 బెంగళూరులో కారు కొనాలని

బెంగళూరులో కారు కొనాలని

రమేష్ కొంతకాలం నుంచి సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కారు కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నాడు. ఈనెల 16వ తేదీన తాను కారు కొనుగోలు చెయ్యాలని అనుకున్నానని, బెంగళూరులో ఇన్నోవా కారు కొనుగోలు చేసుకుని వస్తానని రమేష్ అతని భార్య వెనీలాకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అంతే ఆ రోజు రాత్రి నుంచి రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

 తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటక పోలీసులు ఎంట్రీ

తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటక పోలీసులు ఎంట్రీ

రెండు రోజులు అయినా రమేష్ ఫోన్ చెయ్యకపోవడం, అతనికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో అతని భార్య వెనీలా హడలిపోయింది. తన భర్త రమేష్ ఆచూకి తెలీలేదని అతని భార్య వెనీలా సేలం జిల్లాలోని తారామంగళం పోలీసులను ఆశ్రయించింది. తారామంగళం సీఐ తోల్ కాప్పియన్, ఓమలూరు ఇన్స్ పెక్టర్ కుమార్ తదితరులు స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేశారు. గుర్తు తెలియన శవాలు ఏమైనా బయటపడ్డాయా అంటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పోలీసులు అందరిని సంప్రధించారు.

 బెంగళూరు శివారల్లోని చెరువులో శవమైన రమేష్

బెంగళూరు శివారల్లోని చెరువులో శవమైన రమేష్

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నెలమంగళ సమీపంలో ఓ యువకుడు చెరువులో శవమైనాడని నెలమంగళ పోలీసులు సేలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేలం పోలీసులు వెనీలాను వెంటపెట్టుకుని నెలమంగళ చేరుకున్నారు. చెరువులో శవమైన యువకుడు శవాన్ని పరిశీలించారు. రమేష్ చేతిక కట్టుకున్న దారాలు, అతను వేసుకున్న దుస్తులు, మెడలో ఉన్న దారాలు చూసి అతను నా భర్త అని వెనీలా గుర్తించింది. మొదల రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో రమేష్ హత్యకు గురైనాడని వెలుగు చూసింది.

 మ్యాటర్ మొత్తం చెప్పిన శేఖర్

మ్యాటర్ మొత్తం చెప్పిన శేఖర్

రమేష్ ఇంటి నుంచి బయలుదేరిన తరువాత ఎక్కువగా అతని ఫ్రెండ్ శేఖర్, అతని భార్య స్వరూపాతో మాట్లాడాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు శేఖర్ ను అదుపులోకి తీసుకుని అతన్ని బెండ్ తీశారు. కారు కొనుగోలు చెయ్యడానికి రమేష్ తో పాటను తాను, ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్లామని పోలీసుల విచారణలో శేఖర్ అంగీకరించాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న రమేష్ ను హత్య చెయ్యాలని అనుకున్నానని శేఖర్ పోలీసులకు చెప్పాడు.

 లిక్కర్ పార్టీ ఇచ్చి చంపేశాము

లిక్కర్ పార్టీ ఇచ్చి చంపేశాము

17వ తేదీన రాత్రి అందరూ కలిసి నెలమంగళ సమీపంలో మందుపార్టీ జరుపుకున్నామని, ఆ సమయంలో పీకలదాక మద్యం సేవించిన రమేష్ ను గొంతు నులిమి చంపేశామని శేఖర్ అంగీకరించాడు. రమేష్ కాళ్లు, చేతులు కట్టేసి అతని నడుముకు పెద్దబండరాయి కట్టి శవాన్ని చెరువులో విసిరేశామని శేఖర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురైన రమేష్ హత్య కేసులో శేఖర్ ను అరెస్టు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని సేలం జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+