Illegal affair: కంపెనీ రెస్ట్ రూమ్ లో రెండో భార్య రొమాన్స్, భర్త ఎంట్రీతో సుత్తితో ఫినిష్, ఖర్మ !
చెన్నై/కోయంబత్తూరు/ పొల్లాచ్చి: చక్కగా కాపురం చేస్తున్న భార్య చనిపోవడంతో విరహంతో భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దంపతులు ఇద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తూ, చక్కగా ఇంట్లో కాపురం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కంపెనీలో పని చేస్తున్న మరో వ్యక్తి భార్యను తగులుకున్నాడు, నైట్ డ్యూటీలో భార్య ఆమె ప్రియుడితో కంపెనీ రెస్ట్ రూమ్ లో ఎంజాయ్ చేస్తోంది. అదే టైమ్ లో అనుకోకుండా భర్త ఎంట్రీ ఇచ్చాడు. భార్య భాగోతం చూసిన పాపాని భార్య, ఆమె ప్రియుడు సుత్తితో కొట్టిన దెబ్బలతో భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

టైమ్ బాగాలేక ఫస్ట్ భార్య ?
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం పొల్లాచ్చి సమీపంలోని చంద్రాపురంలో నివాసం ఉంటున్న నాగరాజ్ (37)కు గతంలో పెళ్లి జరిగింది. అనారోగ్యంతో భాదపడుతున్న నాగరాజ్ భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి నాగరాజ్ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు.

అనుకోకుండా అముదతో పెళ్లి
ఒంటరిగా ఉంటున్న నాగరాజ్ బంధువుల ఒత్తిడితో అముత (32) అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పొట్టకూటి కోసం కోయంబత్తూరు చేరుకున్న నాగరాజ్, అముత దంపతులు కోలంపాడిలోని ఫేమస్ ప్యాకింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. దంపతులు ఇద్దరూ ఒకే చోట పని చేస్తూ రాత్రి ఇంటికి వెళ్లి చక్కగా కాపురం చేస్తున్నారు.

శంకర్ తో రెండో భార్య సరసాలు
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన శంకర్ (32) అనే యువకుడు నాగరాజ్, అముత దంపతులు పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజ్, అముత దంపతులకు శంకర్ పరిచయం అయ్యాడు. అప్పుడప్పుడు నాగరాజ్ ఇంటికి వెళ్లి వస్తున్న శంకర్ అతని భార్య అముతను తగులుకుని ఆమెతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు.

టైమ్ చిక్కితే పక్కోడి పెళ్లాంతో రొమాన్స్
భర్ల నాగరాజ్ లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న శంకర్ అతని భార్య అముతతో సరసాలు ఆడుతున్నాడు. టైమ్ చిక్కినప్పుడు నాగరాజ్ ఇంటికి వెలుతున్న శంకర్ అతని బెడ్ రూమ్ ఆక్రమించుకుని అతని భార్యతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రి కంపెనీలో పని ఎక్కవగా ఉండటంతో నాగరాజ్, అముత దంపతులు, శంకర్ తదితరులు అక్కడే భోజనం చేసి పని చేస్తున్నారు.

రెస్ట్ రూమ్ ను బెడ్ రూమ్ చేశారు
అర్దరాత్రి 12. 30 గంటల సమయంలో నాగరాజ్ పనిలో నిమగ్నం అయ్యాడు. కంపెనీలో మరో ప్రాంతంలో పని చేస్తున్న అముత, ఆమె ప్రియుడు శంకర్ రెస్ట్ రూమ్ లోకి వెళ్లిపోయి దానినే బెడ్ రూమ్ చేసుకుని రొమాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో నాగరాజ్ కూడా రెస్ట్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన భార్య అముత బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా శంకర్ తో కలిసి కనపడటంతో నాగరాజ్ రగిలిపోయి నాగుపాములాగా బసలుకొట్టాడు.

సుత్తితో కొట్టి చంపేసిన భార్య, ప్రియుడు
కోపం తట్టుకోలేక నాగరాజ్ శంకర్ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో చేతికి చిక్తిన సుత్తి తీసుకున్న శంకర్ నాగరాజ్ తల మీద దాడి చేశాడు. సుత్తి దెబ్బలకు కిందపడిన భర్త నాగరాజ్ కాళ్లు గట్టిగా పట్టుకున్న అతని రెండో భార్య అముత ప్రియుడు శంకర్ దగ్గర ఉన్న సుత్తి తీసుకుని భార్త నాగరాజ్ ఛాతీ మీద దాడి చేసింది. భార్య అముత, ఆమె ప్రియుడు శంకర్ సుత్తితో చితకబాదడంతో శంకర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

పెళ్లాం నాటకాలు రివర్స్
ప్రియుడు శంకర్ అతని ప్రియురాలు అముత భర్త నాగరాజ్ శవాన్ని కంపెనీ వెనుక భాగంలోకి తీసుకెళ్లి గుంత తీసి పూడ్చేశారు. మరుసటి రోజు కంపెనీ యజమాని ఇక్కడ గుంత ఎందుకు తీశారు ?, ఎందుకు మట్టి పైన ఉంది అనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా నాగరాజ్ శవం బయటపడింది.
Recommended Video

చేసిన పాపం ఊరికే పోతుందా ?
పోలీసుల విచారణలో తన ప్రియుడు శంకర్ తో కలిసి తన భర్తను చంపేశామని అముత అంగీకరించింది. ప్రియుడి వ్యామోహంలో భర్త నాగరాజ్ ను చంపేసిన అముత, ఆమె ప్రియుడు శంకర్ ను కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కంపెనీలో రొమాన్స్ చేస్తూ ఆ ధరిద్రాన్ని చూసిన భర్త భార్య చేతిలోనే హత్యకు గురికావడం కలకలం రేపింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications