Illegal affair: రాత్రి డాడీ, ఆంటీని స్పాట్ లో నరికి చంపిన కొడుకు, రూ. కోట్లు తగలేస్తున్నాడని !

బెంగళూరు/ మైసూరు: ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తికి భార్య ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి తన దగ్గర ఉన్న స్నేహితుడి చనిపోయిన తరువాత అతని కుటుంబానికి ఫైనాన్స్ వ్యాపారి సహాయం చేస్తున్నాడు. అదే సమయంలో స్నేహితుడి భార్యతో ఫైనాన్స్ వ్యాపారి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతని కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. కోటీశ్వరుడైన తన తండ్రి అయిన డబ్బు అంతా అతని ప్రియురాలి కుటుంబానికి తగలేస్తున్నాడని కొడుకు రగిలిపోయాడు. ప్రియురాలికి సొంత ఇల్లు కట్టించిన ఫైనాన్స్ వ్యాపారి ఆమె ఇద్దరు కుమార్తెలకు దగ్గరుండి గ్రాండ్ గా పెళ్లి జరిపించాడు.

తన తండ్రిని ఇలాగే వదిలేస్తే మాకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదని కొడుకు అనుకున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రియురాలి ఇంటిలో ఉంటున్న తండ్రి రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయి మళ్లీ ఉదయం అక్కడికి వెళ్లిపోతున్నాడు. ఈ విషయం జీర్ణయించుకోలేని కొడుకు నేరుగా తండ్రి ఉంటున్న ఆంటీ రాత్రి ఇంటికి వెళ్లాడు. కన్నతండ్రితో పాటు ఆంటీని ఇంటి నుంచి బయటకు లాగిన కొడుకు ఇద్దరిని దారుణంగా నరికేసి స్పాట్ లో నరికి చంపేశాడు. అడ్డు వచ్చిన ఆంటీ కొడుకును కొడవలితో దారుణంగా నరకడంతో అతను ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు.

 ఫైనాన్స్ వ్యాపారి

ఫైనాన్స్ వ్యాపారి

కర్ణాటకలోని రాచనగరి మైసూరు నగరంలోని కేజీ కొప్పళలో శివప్రకాష్ అలియాస్ శివ (56) అనే ఫైనాన్స్ వ్యాపారి నివాసం ఉంటున్నాడు. శివప్రకాష్ కు భార్య, కొడుకు సాగర్ (22), ఓ కుమార్తె ఉన్నారు. మైసూరులో పేరుమోసిన ఫైనాన్స్ వ్యాపారుల్లో శివప్రకాష్ కూడా ఒక్కడు. భార్య, కొడుకు సాగర్, కూతురితో కలిసి శివప్రకాష్ శ్రీనగర్ లోని విలాసవంతమైన ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

 షైనాన్స్ వ్యాపారి ఫ్రెండ్

షైనాన్స్ వ్యాపారి ఫ్రెండ్

శివప్రకాష్ దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటున్న స్నేహితుడి, కారు డ్రైవర్ రవి 12 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రవి, అతని భార్య లతా (48) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, నాగార్జున అనే కొడుకు ఉన్నాడు. తన దగ్గర ఎంతో నమ్మకంగా ఉంటూ చనిపోయిన రవి కుటుంబానికి ఫైనాన్స్ వ్యాపారి శివప్రకాష్ ఆర్థిక సహాయం చేస్తున్నాడు.

 ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం

ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం

రవి భార్య లతాతో శివప్రకాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. మైసూరు నగర శివార్లలోని శ్రీనగర్ కాలనీలో ఫైనాన్స్ వ్యాపరి శివప్రకాష్ అతని ప్రియురాలు లతా ఆంటీకి విలాసవంతమైన ఓ ఇల్లు కట్టించాడు. లతా, ఆమె పిల్లలు శ్రీనగర్ కాలనీలోని సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. స్నేహితుడి భార్య లతా ఆంటీతో ఫైనాన్స్ వ్యాపారి శివప్రకాష్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న ఈ విషయం అతని కొడుకు సాగర్ జీర్ణించుకోలేకపోయాడు.

 ప్రియురాలి కూతుర్లకు గ్రాండ్ గా పెళ్లి చేసిన ఫైనాన్స్ వ్యాపారి

ప్రియురాలి కూతుర్లకు గ్రాండ్ గా పెళ్లి చేసిన ఫైనాన్స్ వ్యాపారి

ప్రియురాలు లతాకు సొంత ఇల్లు కట్టించిన ఫైనాన్స్ వ్యాపారి శివప్రకాష్ ఆమె ఇద్దరు కుమార్తెలకు అతనే పెళ్లి సంబంధాలు చూసి అతనే దగ్గరుండి గ్రాండ్ గా పెళ్లి జరిపించాడు. కోటీశ్వరుడైన తన తండ్రి శివప్రకాష్ అయిన డబ్బు అంతా అతని ప్రియురాలు లతా ఆంటీ కుటుంబానికి తగలేస్తున్నాడని అతని సొంత కొడుకు సాగర్ రగిలిపోయాడు.

 పగలు ప్రియురాలు.... రాత్రి భార్య, పిల్లలు

పగలు ప్రియురాలు.... రాత్రి భార్య, పిల్లలు

ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రియురాలు లతా ఇంటిలో ఉంటున్న శివప్రకాష్ రాత్రి కోప్పళలోని అతని ఇంటికి వెళ్లి నిద్రపోయి మళ్లీ ఉదయం లతా ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న శివప్రకాష్ లెక్కలు మొత్తం అతని ప్రియురాలు లతాకు చెబుతున్నాడని, మా అమ్మకు ఏమాత్రం చెప్పడం లేదని సాగర్ కు తెలిసింది.

 కొడుకుకి పైసాకూడా ఇవ్వని తండ్రి

కొడుకుకి పైసాకూడా ఇవ్వని తండ్రి

సాగర్ అతని స్నేహితులతో తిరుగుతూ మద్యం సేవించడానికి అలవాటు పడ్డాడని, పేకాట ఆడుతున్నాడని తెలిసింది. సాగర్ ఖర్చులకు డబ్బులు కావాలని అడిగితే అతని తండ్రి శివప్రకాష్ ఇవ్వడం లేదని వెలుగు చూసింది. తన తండ్రి శివప్రకాష్ ను ఇలాగే వదిలేస్తే మాకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదని అతని కొడుకు సాగర్ అనుకున్నాడు.

 కొడుకు ఎంట్రీతో తండ్రి షాక్

కొడుకు ఎంట్రీతో తండ్రి షాక్

తండ్రి శివప్రకాష్ ప్రియురాలు లతా విషయాన్ని అతని కొడుకు సాగర్ జీర్ణయించుకోలేకపోయాడు. గురువారం రాత్రి సాగర్ నేరుగా అతని తండ్రి ప్రియురాలు లతా ఇంటికి వెళ్లాడు. కొడుకు సాగర్ వెళ్లిన సమయంలో అతని తండ్రి శివప్రకాష్ లతా ఇంటిలోనే ఉన్నాడు. కొడుకు సాగర్ నేరుగా లతా ఇంటికి రావడంతో అతని తండ్రి శివప్రకాష్ హడలిపోయాడు.

 డాడీ, ఆంటీని ఒకేసారి నరికేశాడు

డాడీ, ఆంటీని ఒకేసారి నరికేశాడు

కన్నతండ్రి శివప్రకాష్ ను బయటకు పిలిచిన సాగర్ అతనితో గొడవపడ్డాడు. ఆ సమయంలో తండ్రి కొడుకుల మద్య మాటామాటా పెరిగిపోయింది. చుట్టుపక్కల వారు వచ్చి బయట నిలబడ్డారు. ఆ సమయంలో రగిలిపోయిన సాగర్ బ్యాగ్ లొ ఉన్న కొడవలి తీసుకుని అతని తండ్రి శివప్రకాష్ ను దారుణంగా నరికేశాడు. ఆ సమయంలో లతా అడ్డుపడటంతో ఇంత జరగడానికి నువ్వే కారణం అంటూ సాగర్ తండ్రి ప్రియురాలు లతాను దారుణంగా నరకేశాడు. సాగర్ కొడవలితో నరకడంతో అతని తండ్రి శివప్రకాష్, అతని ప్రియురాలు లతా స్పాట్ లో ప్రాణాలు వదిలేశారు.

 ఆంటీ కొడును చంపేయాలని ప్లాన్

ఆంటీ కొడును చంపేయాలని ప్లాన్

కన్నతండ్రి శివప్రకాష్ తో పాటు లతా ఆంటీని ఇంటి నుంచి బయటకు లాగిన సాగర్ ఇద్దరిని దారుణంగా నరికేసి స్పాట్ లో నరికి చంపడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆసమయంలో సాగర్ కు అడ్డు వచ్చిన లతా ఆంటీ కొడుకు నాగార్జునను కొడవలితో దారుణంగా నరకడంతో అతను ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. తండ్రి శివప్రకాష్, ఆయన ప్రియురాలిని హత్య చేసిన సాగర్ తప్పించుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని మైసూరు సిటీ పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+