Illegal affair: వ్యాపారి రెండో భార్య, భర్తకు పానీపూరి, ప్రియుడికి మసాలా పూరి, సినిమా సీన్లు, క్లైమాక్స్ లో ? !
బెంగళూరు/ ఉడిపి: వ్యాపారం చేస్తున్న వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అతనికంటే 17 ఏళ్ల వయసు తక్కువ ఉన్న అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో కాపురం చేస్తున్న అతను వ్యాపారం చేసుకుంటూ వెలుతున్నాడు. ఇదే సమయంలో భార్య ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతుంటే అతని రెండో భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని జల్సా చేస్తోంది. చాలాకాలం పాటు భార్య రంకుపురాణం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. ఊరి బయట వ్యాపారి శవమై కనిపించాడు. వ్యాపారి శవానికి నిప్పంటించడంతో అర్దం కాలిపోయింది. నానాతంటాలు పడిన పోలీసులు ఆ శవం వ్యాపారిది అని గుర్తించారు. పోలీసులు దర్యాప్తులో వ్యాపారి రెండో భార్య, ఆమె ప్రియుడి మ్యాటర్, వాళ్లు అతన్ని ఎలా హత్య చేసి శవాన్ని బయటకు తీసుకెళ్లి నిప్పంటించారు అని పూర్తి మ్యాటర్ బయటకు వచ్చింది.

వ్యాపారి రెండో పెళ్లి
మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని షెగావ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జాదవ్ వాస్తీ (42) అనే వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జాదవ్ వాస్తీ అతనికంటే 17 ఏళ్ల వయసు తక్కువ ఉన్న అందమైన సురేఖా జాదవ్ అలియాస్ సురేఖా (25) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.

భర్త వ్యాపారం చేస్తుంటే భార్య ప్రియుడితో ?
రెండో భార్య సురేఖాతో కాపురం చేస్తున్న జాదవ్ వాస్తీ వ్యాపారం చేసుకుంటూ వెలుతున్నాడు. ఇదే సమయంలో జాదవ్ రెండో భార్య సురేఖా సంగీత్ దేవ్ కేట్ (30) అనే ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త జాదవ్ వాస్తీ వ్యాపారం చెయ్యడానికి బయటకెళ్లి బీజీగా ఉంటే అతని రెండో భార్య సురేఖా ఆమె ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను ఇంటికి పిలిపించుకుని జల్సా చేస్తోంది.

భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య
చాలాకాలం పాటు జాదవ్ రెండో భార్య సురేఖా, సంగీత్ దేవ్ కేట్ ల రంకుపురాణం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇటీవల జాదవ్ అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ తో జల్సా చేస్తున్న సురేఖా రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది.

భర్త అడ్డుపడుతున్నాడని చంపేసిన భార్య
రెండో భార్య సురేఖా తీరుతో రగిలిపోయిన జాదవ్ ఆమెను పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు. సురేఖాను బయటకు వెళ్లనివ్వకుండా, ఆమె ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను కలవకుండా చేశాడు. పక్కాప్లాన్ ప్రకారం అర్దరాత్రి ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను ఇంటికి పిలిపించుకున్న సురేఖా నిద్రపోతున్న ఆమె భర్త జాదవ్ వాస్తీని చంపేసింది.

ప్రియుడితో కలిసి మొగుడి శవం మాయం చేసిన భార్య
ఇంట్లో జాదవ్ వాస్తీని చంపేసిన సురేఖా, ఆమె ప్రియుడు సంగీత్ అతని శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చెయ్యాలని అనుకున్నారు. వ్యాపారి జాదవ్ శవం అర్దకాలిపోయింది. నానాతంటాలు పడిన పోలీసులు ఆ శవం వ్యాపారి జాదవ్ ది అని గుర్తించారు.

ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటే ?
పోలీసులు దర్యాప్తులో వ్యాపారి జాదవ్ ను అతని రెండో భార్య సురేఖా, ఆమె ప్రియుడు సంగీత్ హత్య చేశారు అని పోలీసులు గుర్తించారు. అప్పటికే సురేఖా, ఆమె ప్రియుడు సంగీత్ జెండా ఎత్తేశారని పోలీసులు తెలుసుకున్నారు. నాగర్ పూర్ లో తలదాచుకున్న సురేఖాను, యవ్మల్ ప్రాంతంలో తలదాచుకున్న సురేఖా ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను, హత్యకు సహకరించిన రౌతక అనే మరో వ్యక్తిని జాదవ్ ను హత్య చేసిన 72 గంటల్లో అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. వ్యాపారి జాదవ్ వాస్తీని ఇంట్లో ఎలా హత్య చేసి అతని శవాన్ని బయటకు తీసుకెళ్లి నిప్పంటించారు అని పూర్తి మ్యాటర్ సురేఖా, సంగీత్ చెప్పారని పోలీసు అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications