Illegal affair: నాలుగో ప్రియుడితో కలిసి మూడో మొగుడిని చంపేసిన ఆంటీ, 23 ఏళ్లు తేడా !

భోపాల్/ ఇండోర్: వ్యాపారం చేస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైనాడు. యువకుడిని హత్య చేసిన నిందితులు తప్పించుకున్నారు. తలకు తీవ్రగాయాలై హత్యకు గురైన యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు ఎలాంటి క్లూ చిక్కలేదు. యువకుడి తల మీద దారుణంగా దాడి చేసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించడంతో లేడీస్ వేసుకునే చెప్పు ఒకటి చిక్కింది. అంతే యువకుడు మొబైల్ ఫోన్ నెంబర్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. ఇదే సమయంలో హత్యకు గురైన యువకుడికి మూడుసార్లు పెళ్లి అయ్యిందని, మూడో సారి ఓ ఆంటీని అతను వివాహం చేసుకున్నాడని వెలుగు చూసింది. ఆంటీకి కూడా మూడుసార్లు పెళ్లి అయ్యిందని, తరువాత ఆమె హత్యకు గురైన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గుడిలో పెళ్లి చేసుకుందని పోలీసులు గుర్తించారు. అంతే ఆంటీని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఆమె నాలుగో ప్రియుడి మ్యాటర్ బయటకు వచ్చింది. పోలీసులు ఆంటీ, ఆమె ప్రియుడిని బెండ్ తియ్యడంతో స్టోరీ మొత్తం బయటకు వచ్చిందని పోలీసులు అన్నారు.

 వ్యాపారం చేస్తున్న యువకుడు

వ్యాపారం చేస్తున్న యువకుడు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దీపక్ మాణిక్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న దీపక్ మాణిక్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇదే సమయంలో ఇండోర్ సమీపంలోని నిర్జనప్రదేశంలో దీపక్ మాణిక్ దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

 పోలీసులకు క్లూ చిక్కకుండా చేసిన హంతకులు

పోలీసులకు క్లూ చిక్కకుండా చేసిన హంతకులు

వ్యాపారం చేస్తున్న దీపక్ మాణిక్ దారుణ హత్యకు గురైన విషయం కలకలం రేపింది. దీపక్ మాణిక్ ను హత్య చేసిన నిందితులు అక్కడ ఎలాంటి సాక్షాలు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. తలకు తీవ్రగాయాలై హత్యకు గురైన దీపక్ మాణిక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని పోలీసులు అన్నారు. దీపక్ మాణిక్ హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు మొదట్లో ఎలాంటి క్లూ చిక్కలేదు.

 లేడీస్ చెప్పులతో సీన్ రివర్స్

లేడీస్ చెప్పులతో సీన్ రివర్స్

దీపక్ మాణిక్ తల వెనుక భాగంలో ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. పోలీసులు దీపక్ మాణిక్ హత్య జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించడంతో లేడీస్ వేసుకునే చెప్పు ఒకటి చిక్కింది. అంతే దీపక్ మాణిక్ మొబైల్ ఫోన్ నెంబర్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు.

 ఆంటీకి మూడు పెళ్లిళ్లు.... వ్యాపారికి మూడు పెళ్లిళ్లు

ఆంటీకి మూడు పెళ్లిళ్లు.... వ్యాపారికి మూడు పెళ్లిళ్లు

హత్యకు గురైన దీపక్ మాణిక్ కు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి అయ్యిందని పోలీసులకు తెలిసింది. మూడో సారి మంగళా (55) అనే ఆంటీని దీపక్ మాణిక్ వివాహం చేసుకున్నాడని వెలుగు చూసింది. మంగళా ఆంటీకి కూడా గతంలో మూడుసార్లు పెళ్లి అయ్యిందని, తరువాత ఆమె హత్యకు గురైన దీపక్ మాణిక్ తో అక్రమ సంబంధం పెట్టుకుని గుడిలో సీక్రేట్ గా పెళ్లి చేసుకుందని పోలీసులు గుర్తించారు.

 అక్కడే తేడా వచ్చింది

అక్కడే తేడా వచ్చింది

మంగళా తనను పెళ్లి చేసుకున్నా ఆమె వేరే మగాళ్తో తిరుగుతోందని తెలుసుకున్న దీపక్ మాణిక్ అదే విషయంలో ఆంటీతో గొడవపడేవాడని పోలీసులకు తెలిసింది. నువ్వుకూడా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నావని, నా విషయంలో ఎందుకు గొడవ చేస్తున్నావని మంగళా కూడా దీపక్ మాణిక్ తో గొడవ చేసేదని సమాచారం.

 ప్రియుడి హత్య తరువాత ఆంటీ మాయం

ప్రియుడి హత్య తరువాత ఆంటీ మాయం

దీపక్ ప్రతినిత్యం మంగళాకు ఎక్కువగా ఫోన్ చేశాడని, ఆమె కూడా అతనికి ప్రతిరోజూ ఫోన్ చేసదని పోలీసులు అన్నారు. దీపక్ హత్య జరిగిన తరువాత నుంచి మంగళా అతనికి ఫోన్ చెయ్యలేదని, ఇంట్లో కూడా లేకుండా తప్పించుకుని తరుగుతోందని పోలీసులు గుర్తించారు. మంగళా కోసం గాలించిన పోలీసులు చివరికి ఆమెను పట్టుకున్నారు.

 ఆంటీకి నాలుగో ప్రియుడు

ఆంటీకి నాలుగో ప్రియుడు

పోలీసులు పక్కా సమాచారంతో మంగళా ఆంటీని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఆమె నాలుగో ప్రియుడు గణేష్ మ్యాటర్ బయటకు వచ్చింది. పోలీసులు మంగళా ఆంటీ, ఆమె ప్రియుడు గణేష్ ను బెండ్ తియ్యడంతో స్టోరీ మొత్తం బయటకు వచ్చిందని ఇండోర్ పోలీసు అధికారులు అన్నారు.

Recommended Video

    వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ అంతర్గత అంశాలపై స్పందిచనన్న జగ్గారెడ్డి!!
     సంసారం చేసే విషయంలో గొడవలు

    సంసారం చేసే విషయంలో గొడవలు

    సంసారం చేసే విషయంలో తనకు దీపక్ మాణిక్ మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని, తనను బయటకు వెళ్లకుండా చెయ్యాలని అతని ప్రయత్నించాడని, ఇదే సమయంలో తనకు ముందు నుంచి పరిచయం ఉన్న గణేష్ ను పిలిపించుకుని దీపక్ మాణిక్ ను హత్య చేశామని మంగళా అంగీకరించిందని పోలీసులు అన్నారు. దీపక్ మాణిక్ హత్య కేసులో మంగళా, ఆమె ప్రియుడు గణేష్ ను అరెస్టు చేశామని ఇండోర్ పోలీసు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+