Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: అల్లుడితో ఆంటీ ఎస్కేప్, పట్టుకుని వచ్చిన మొగుడు, స్పాట్ లో చంపిన ప్రియుడు, క్లోజ్ !

రాజ్ కోట్/చెన్నై: భర్తతో కాపురం చేసిన భార్య ఓ కొడుక్కి, ఇద్దరు కూతుర్లకు తల్లి అయ్యింది. కొడుకు, కూతుర్లకు పెంచి పెద్ద చేసిన దంపతులు వారి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. పెద్ద కుమార్తెకు మంచి పెళ్లి సంబంధం చిక్కడంతో కూతురు వివాహం జరిపించారు. కూతురు, ఆమె భర్త కలిసి అత్తారింటికి వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో అల్లుడి కుటుంబ సభ్యులు దంపతులకు చాలా దగ్గర అయ్యారు. తాము కలిసి మెలసి ఉంటే తన కూతురు అల్లుడి ఇంట్లో సంతోషంగా ఉంటుందని తండ్రి అనుకున్నాడు. అయితే కూతురి భర్త సోదరుడితో ఆంటీ చనువు పెంచుకుంది. వరుసకు అల్లుడు అయ్యే వ్యక్తి ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో ఆంటీ అతని వలలో పడిపోయింది. సొంత అల్లుడి అన్నతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. కూతురికి వివాహం అయ్యింది, మరో కూతురికి, కొడుక్కి వివాహం చెయ్యాలి అనే విషయం మరిచిపోయిన ఆంటీ అల్లుడి అన్నతో కలిసి ఇల్లు వదిలిపారిపోయింది. ప్రియుడితో కలిసి కాపురం పెట్టిన ఆంటీని ఆమె భర్త పట్టుకుని వచ్చి ఇంట్లో పెట్టాడు. ఆంటీ దూరం కావడంతో ప్రియుడు ఆమెతో మోజు తీర్చుకోలేకపోయాడు. ఒకసారి లేచిపోయి బుద్ది తెచ్చుకున్న ఆంటీ ఇంట్లో భర్తతో కలసి ఉంటోంది. ఆంటీ ఇంటికి వెళ్లిన ఆమె ప్రియుడు నీ భార్యను రెండు రోజుల్లో పంపిస్తాను, ఇప్పుడు నా వెంట పంపించు అని చెప్పాడు. అక్కడ మాటా మాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన ప్రియుడు భర్త కళ్ల ముందే ఆంటీని స్పాట్ లో దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 అందమైన ఆంటీకి ఇద్దరు కూతుర్లు

అందమైన ఆంటీకి ఇద్దరు కూతుర్లు

గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలోని మోర్చి జిల్లా, మలియా మియానా తాలుకాలోని ఖక్రేచి గ్రామంలో రంజిత్ వాసవా (50), శారాదా వాసవా (48) దంపతులు నివాసం ఉంటున్నారు. రంజిత్, శారదా దంపతులు వివాహం జరిగిన తరువాత చాలా సంతోషంగా ఉండేవారు. భర్త రంజిత్ వాసవాతో కాపురం చేసిన శారదా ఓ కొడుక్కి, ఇద్దరు కూతుర్లకు తల్లి అయ్యింది. కొడుకు, కూతుర్లకు పెంచి పెద్ద చేసిన రంజిత్ వాసవా, శారదా దంపతులు వారి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. కూతుర్లు పెళ్లి వయసుకు వచ్చినా శారదా చూడటానికి ఎర్రగా, బుర్రగా, పొడుగ్గా చాలా అందంగా ఉండేది.

 పెద్ద కూతురి పెళ్లి గ్రాండ్ గా చేశారు

పెద్ద కూతురి పెళ్లి గ్రాండ్ గా చేశారు

పెద్ద కుమార్తెకు మంచి పెళ్లి సంబంధం చిక్కడంతో మూడు సంవత్సరాల క్రితం రంజిత్ వాసవా, శారదా దంపతులు బిజల్ అనే యువకుడితో కూతురు వివాహం జరిపించారు. కూతురు, ఆమె భర్త బిజల్ కలిసి అత్తారింటికి వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో అల్లుడు బిజల్ కుటుంబ సభ్యులు రంజిత్ వాసవా, శారదా దంపతులకు చాలా దగ్గర అయ్యారు. తాము కలిసి మెలసి ఉంటే తన కూతురు అల్లుడు బిజల్ ఇంట్లో సంతోషంగా ఉంటుందని ఆమె తండ్రి రంజిత్ వాసవా అనుకున్నాడు.

అత్తను తగులుకున్న అల్లుడి అన్న

అత్తను తగులుకున్న అల్లుడి అన్న


కూతురి భర్త బిజల్ అన్న భూపత్ తో శారదా ఆంటీ చనువు పెంచుకుంది. సోదరుడు బిజల్ అత్తగారింటికి ఎక్కువగా వెళ్లి వస్తున్న భూపత్ వరుసకు అత్త అయ్యే శారదాను చూసి మోజు పడ్డాడు. శారదా చూడటానికి ఎర్రగా, బుర్రగా పొడుగ్గా ఉండటంతో ఆమెను చూసి భూపత్ తట్టుకోలేకపోయాడు. వరుసకు అల్లుడు అయ్యే భూపత్ ఇంటికి వచ్చి వెలుతున్న సమయంలో శారదా ఆంటీ అతని వలలో పడిపోయింది.

ఎవ్వరికీ డౌట్ రాలేదు

ఎవ్వరికీ డౌట్ రాలేదు


సొంత అల్లుడు బిజల్ అన్న భూపత్ అక్రమ సంబంధం పెట్టుకున్న శారదా ఆంటీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తన పుట్టింటికి తన బావ భూపత్ అప్పుడప్పుడు వెళ్లి వస్తూ వారి భాగోగులు చూసుకుంటున్నాడని శారదా కూతురు అనుకుంది. తన సొంత అల్లుడు బిజల్ అన్నకు మేమంటే ఇష్టం అని శారదా భర్త రంజిత్ వాసవా అనుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్లు అక్కడ కథ నడవలేదు. అల్లుడు అన్న భూపత్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న శారదా ఆమె బెడ్ రూమ్ ను స్వర్గంగా మార్చుకుంది.

అల్లుడితో లేచిపోయిన అత్త

అల్లుడితో లేచిపోయిన అత్త


శారదా, భూపత్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే విషయం చాలా కాలం బయటకు రాలేదు. తన పెద్ద కూతురికి వివాహం అయ్యింది, మరో కూతురికి, కొడుక్కి వివాహం చెయ్యాలి అనే విషయం మరిచిపోయిన శారదా ఆంటీ అల్లుడు బిజల్ అన్న భూపత్ తో కలిసి ఐదు నెలల క్రితం భర్త రంజిత్ వాసవాను, పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడు భూపత్ తో పారిపోయింది. ఇల్లు వదిలిపారిపోయిన శారదా ప్రియుడు భూపత్ తో కలిసి కాపురం పెట్టింది.

కాళ్లు పట్టుకుని పిలుచుకుని వచ్చిన భర్త

కాళ్లు పట్టుకుని పిలుచుకుని వచ్చిన భర్త

ప్రియుడు భూపత్ తో కలిసి కాపురం పెట్టిన శారదా ఆంటీ ఆచూకి మూడు నెలల తరువాత తెలుసుకున్న ఆమె భర్త రంజిత్ వాసవా అక్కడికి వెళ్లి ఆమె కాళ్లు పట్టుకుని పిలుచుకుని వచ్చి ఇంట్లో పెట్టాడు. శారదా ఆంటీ దూరం కావడంతో ఆమె ప్రియుడు భూపత్ ఆమెతో మోజు తీర్చుకోలేకపోయాడు. ఒకసారి అల్లుడితో కలిసి లేచిపోయి బుద్ది తెచ్చుకున్న శారదా ఆంటీ ఇంట్లో భర్త రంజిత్ తో కలసి కామ్ గా ఉంటోంది.

 ఆంటీని పంపించాలని ఆమె భర్తకే చెప్పిన ప్రియుడు

ఆంటీని పంపించాలని ఆమె భర్తకే చెప్పిన ప్రియుడు

శారదా ఆంటీ ఇంటికి వెళ్లిన ఆమె ప్రియుడు భూపత్ నీ భార్యను రెండు రోజుల్లో నాతో పంపించు, తరువాత నేను మీ ఇంటికి పంపించేస్తాను అని ఆమె భర్త రంజిత్ కు చెప్పాడు. రంజిత్ అతని భార్య శారదాను బయటకు పంపించనని చెప్పాడు. ఇప్పుడు మర్యాదగా నీ భార్య శారదాను నా వెంట పంపించు, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని భూపత్ ఆంటీ మొగుడు రంజిత్ వాసవాకు వార్నింగ్ ఇచ్చాడు.

 భర్త కళ్ల ముందే భార్యను హత్య చేసిన ప్రియుడు

భర్త కళ్ల ముందే భార్యను హత్య చేసిన ప్రియుడు

నేను నీ వెంట రాను అని శారదా ఆంటీ ఆమె మాజీ ప్రియుడు భూపత్ కు తేల్చి చెప్పింది. ఆ సమయంలో అక్కడ శారదా, భూపత్, ఆమె భర్త రంజిత్ మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రియుడు భూపత్ భర్త రంజిత్ కళ్ల ముందే శారదా ఆంటీని దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది. తన భార్య శారదా హత్యకు గురి కావడంతో రంజిత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియురాలు శారదాను హత్య చేసిన భూపత్ ను అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగా భర్త కళ్ల ముందే అతని భార్య శారదా ప్రియుడు భూపత్ చేతిలో హత్యకు గురి కావడం గుజరాత్ లో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+