Illegal affair: మేడమ్ భర్తను, వీడు భార్యను వదిలేశారు, ఒకే ఇంట్లో ?, ముక్కు కోసేసి, మ్యాటర్ వేరే !
భోపాల్: ఓ వ్యక్తి అతని భార్యకు దూరంగా ఉంటున్నాడు. భర్తను గాలికి వదిలేసిన లేడీ ఒంటరిగా ఉంటున్నది. భార్యకు దూరంగా ఉంటున్న వ్యక్తి భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు విరహంతో ఉండటంతో వివాహం చేసుకోకుండానే కొంతకాలంగా ఒకే ఇంటిలో కాపురం ఉంటూ సహజీవనం చేస్తున్నారు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ విషయంలో ప్రియురాలితో ప్రియుడు గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రియుడు పదునైన కత్తి తీసుకుని ప్రియురాలి ముక్కు కోసేసి కసి తీర్చుకున్నాడు.

భార్యను వదిలేశాడు దూరంగా ఉంటున్నాడు
మధ్యప్రదేశ్ లోని ఖ్వాండా జిల్లాలో లవ్ కుష్ పటేల్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకుని భార్యతో కాపురం చేసిన లవ్ కుష్ పటేల్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. భార్యతో నిత్యం గొడవలు పడుతున్న లవ్ కుష్ పటేల్ కొన్ని సంవత్సరాల క్రితం అతని భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు.

భర్తను గాలికి వదిలేసిన సోనూ మేడమ్
భోపాల్ లో సోనూ (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న సోనూ ఆమె భర్తతో కొంతకాలం కాపురం చేసింది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో సోనూ ఆమె భర్తను గాలికి వదిలేసి అతనికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. భార్య దూరంగా ఉంటున్న లవ్ కుష్ పటేల్, భర్తకు దూరంగా ఉంటున్న సోనూకు పరిచయం అయ్యింది.

విరహంతో అక్రమ సంబంధం...... సహజీవనం
భార్యకు దూరంగా ఉంటున్న లవ్ కుష్ పటేల్, భర్తకు దూరంగా ఉంటున్న సోనూ చాలాకాలం కలిసి తిరిగారు. సోనూ, లవ్ కుష్ పటేల్ ఇద్దరు విరహంతో ఉండటంతో వివాహం చేసుకోకుండానే కొంతకాలంగా అక్రమ సంబంధం పెట్టుకుని ఒకే ఇంటిలో కాపురం ఉంటున్నారు. పగటి పూట ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్న లవ్ కుష్ పటేల్, సోనూ రాత్రి ఒకే ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రియుడు తాగుబోతు
లవ్ కుష్ పటేల్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ఎప్పుడంటే అప్పుడు ప్రియురాలు సోనూ దగ్గర డబ్బులు తీసుకువెలుతున్న లవ్ కుష్ పటేల్ పీకలదాక మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్నాడు. మద్యాహ్నం సోనూ ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో తనకు రూ. 400 డబ్బులు కావాలని సోనూను ఆమె ప్రియుడు లవ్ కుష్ పటేల్ అడిగాడు.

ప్రియురాలి ముక్కు కోసి మాయం అయిన ప్రియుడు
తన దగ్గర డబ్బులు లేవని, నువ్వు అడిగినప్పుడు నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలని, నీకు ఇష్టం ఉంటే నాతో కలిసి ఉండు, లేదంటే వెళ్లిపో అంటూ సోనూ ఆమె ప్రియుడు లవ్ కుష్ పటేల్ మీద మండిపడింది. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రియుడు లవ్ కుష్ పటేల్ పదునైన కత్తి తీసుకుని అతని ప్రియురాలు సోనూ ముక్కు కోసేసి కసి తీర్చుకుని అక్కడి నుంచి పరారైనాడు.

చిక్కిపోయిన ప్రియుడు
సోనూ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి మాకు సమాచారం ఇచ్చారని ఓ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. ప్రియురాలి ముక్కు కోసేసి పారిపోయిన లవ్ కుష్ పటేల్ మరుసటి రోజు రాత్రి పోలీసులకు చిక్కిపోవడంతో అతన్ని జైలుకు పంపించామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications