Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భార్య కళ్లముందే మాజీ ప్రియురాలితో భర్త ?, రచ్చరచ్చ, క్లైమాక్స్ లో ఐసీయూలో ప్రియుడు !

చెన్నై/టీ. నగర్: పక్కపక్క ఏరియాల్లో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. యువతి కుటుంబ సభ్యులకు ఆ ప్రాంతంలో ఫేమస్ స్వీట్ స్టాల్ ఉంది. పెళ్లికాకముందే యువతి, యువకుడు వివాహారయాత్రలకు తిరిగి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. యువతి స్వీట్ స్టాల్ లో ఉన్న సమయంలో ఆ యువకుడు స్వీట్లు కొనుగోలు చేసేవాడిలాగా అక్కడికి వెళ్లి ఆమెను కలిసేవాడు. ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు వేరే పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. పెళ్లి చేసుకున్న మాజీ ప్రియుడితో ఆమె మళ్లీ టచ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేసింది. అయితే మాజీ ప్రేమికుల కారణంగా ప్రియుడి మీద హత్యాయత్నం జరగడంతో అతను ఐసీయూలో ఉన్నాడు. ప్రియుడి స్నేహితుల రెచ్చిపోవడంతో ప్రియురాలు స్వీట్ స్టాల్ ద్వంసం కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎంజాయ్ చేసిన ప్రేమికులు

ఎంజాయ్ చేసిన ప్రేమికులు

చెన్నై సిటీలోని తిరుమలైవేలో శంకర్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. అదే ఏరియాలో నివాసం ఉంటున్న షర్మిల, శంకర్ ప్రేమించుకున్నారు. షర్మిల కుటుంబ సభ్యులకు ఆ ప్రాంతంలో ఫేమస్ స్వీట్ స్టాల్ ఉంది. పెళ్లికాకముందే ప్రేమికులు శంకర్, షర్మిల చాలాసార్లు వివాహారయాత్రలకు తిరిగి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

విడిపోయిన ప్రేమికులు

విడిపోయిన ప్రేమికులు

శంకర్, షర్మిల ప్రేమించుకున్న విషయం వాళ్ల స్నేహితులకు కూడా తెలుసు. శంకర్, షర్మిల కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. షర్మిల కుటుంబ సభ్యులకు ఆ ఏరియాలో ఫేమస్ స్వీట్ స్టాల్ ఉంది. షర్మిల ఆమె స్వీట్ స్టాల్ లో ఉన్న సమయంలో ఆమె ప్రియుడు శంకర్ స్వీట్లు కొనుగోలు చేసేవాడిలాగా అక్కడికి వెళ్లి ఆమెను కలిసేవాడు.

వేరే పెళ్లి చేసుకున్న ప్రియుడు

వేరే పెళ్లి చేసుకున్న ప్రియుడు


కొంతకాలం తరువాత ప్రేమికులు శంకర్, షర్మిల మద్య తేడాలు రావడంతో ఇద్దరు కొంతకాలం దూరం అయ్యి తరువాత విడిపోయారు. ప్రియురాలు షర్మిల పోతేపోయింది అనుకున్న ఆమె ప్రియుడు శంకర్ రెండు సంవత్సరాల క్రితం అన్నారసిక అనే యువతిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రికూడా అయ్యాడు.

పెళ్లి చేసుకున్న తరువాత ప్రియురాలితో ఎంజాయ్

పెళ్లి చేసుకున్న తరువాత ప్రియురాలితో ఎంజాయ్


పెళ్లి చేసుసుకుని భార్య అన్నారసికతో కాపురం చేస్తున్న మాజీ ప్రియుడు శంకర్ తో అతని మాజీ ప్రియురాలు షర్మిల మళ్లీ టచ్ లోకి వెళ్లింది. భార్య అన్నారసిక ఉన్నా శంకర్ అతని మాజీ ప్రియురాలు షర్మిలతో మళ్లీ జల్సా చెయ్యడం మొదలు పెట్టాడు. అయితే మద్యలో మళ్లీ ప్రియురాలు షర్మిలకుకి హ్యాండ్ ఇచ్చేసిన శంకర్ ఆమెకు చిక్కకుండా తప్పించుని తిరుగడం మొదలుపెట్టాడు.

భార్య ముందే మాజీ ప్రేమికుల ఢిష్యూం ఢిష్యూం

భార్య ముందే మాజీ ప్రేమికుల ఢిష్యూం ఢిష్యూం

సాయంత్రం శంకర్ అతని భార్య అన్నారసిక, బిడ్డతో కలిసి మాజీ ప్రియురాలు షర్మిల స్వీట్ స్టాల్ కు వెళ్లాడు. ఆ సమయంలో షర్మిల మాత్రమే స్వీట్ స్టాల్ లో ఉంది. శంకర్ అతని మాజీ ప్రియురాలు షర్మిల షాపులో స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో మాజీ ప్రేమికులు శంకర్, షర్మిల మద్య గొడవ జరిగి మాటామాటా పెరిగిపోయింది. నువ్వు నన్ను మోసం చేశావు అంటే లేదు నువ్వే నన్ను మోసం చేశారని ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు.

ఐసీయూలో ప్రియుడు..... ప్రియురాలి స్వీట్ స్టాల్ ద్వంసం

ఐసీయూలో ప్రియుడు..... ప్రియురాలి స్వీట్ స్టాల్ ద్వంసం

సహనం కోల్పోయిన మాజీ ప్రియురాలు షర్మిల ఆమె తమ్ముడు ఇలంగోవన్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. మాజీ ప్రియురాలు షర్మిల తమ్ముడు ఇళంగోవన్, అతని ఫ్రెండ్స్ వెళ్లి స్వీట్ స్టాల్ లో భార్య అన్నారసికకతో కుర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న అక్క షర్మిల మాజీ ప్రియుడు శంకర్ ను పట్టుకుని చితకబాదేశారు. ఇళంగోవన్, అతని ఫ్రెండ్స్ చితకబాదేశారు. తీవ్రగాయాలైన మాజీ ప్రియుడు శంకర్ ను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు.

ప్రియురాలు స్వీట్ స్టాల్ ద్వంసం

ప్రియురాలు స్వీట్ స్టాల్ ద్వంసం

షర్మిల సోదరుడు ఇళంగోవన్ అతన స్నేహితులు మాజీ ప్రియుడు శంకర్ మీద దాడి చేశారని తెలుసుకున్న శంకర్ స్నేహితులు రగిలిపోయారు. మాజీ ప్రియురాలు షర్మిల తమ్ముడు ఇళంగోవన్ తో పాటు అతని స్నేహితులను చితకబాదేశారు. మాజీ ప్రియురాలు షర్మిల స్వీట్ స్టాల్ ను ధ్వంసం చెయ్యడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు షర్మిల షాపును ద్వంసం చేసిన కేసులో శంకర్, తమిళనసెల్వన్, జెర్మియా అనే ముగ్గురిని అరెస్టు చేసి పుల్లల్ జైలుకు తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+