owner: ప్రియుడితో మస్త్ మజా, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇంటి ఓనర్ ను చంపేసిన కన్నింగ్ లేడీ, మ్యాటర్ ?

రిజర్వు ఫారెస్టులో సగం కాలిన మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల విచారణలో మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్న కిలాడీ లేడీ గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

చెన్నై/ తిరువణ్ణామలై: రిజర్వు ఫారెస్టులో సగం కాలిన మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ అడవికి ఎందుకు వచ్చింది ?, ఆమెను ఎవరు చంపారు? మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేశారా ? అంటూ అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు. ఇదే సమయంలో ఓ మహిళ కనపడటం లేదని ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

మహిళ దారుణ హత్య

మహిళ దారుణ హత్య

తమిళనాడులోని తిరువణ్ణామలైలో విజయ (59) అనే మహిళ నివాసం ఉంటున్నది. విజయకు సొంత ఇండ్లు ఉన్నాయి. కొన్ని ఇండ్లు అద్దెకు ఇచ్చిన విజయ ప్రతినెల బాడుగలు తీసుకుంటున్నది. విజయ దగ్గర బంగారు నగలు, నగదు భారీ మొత్తంలో ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి విజయ కనపడకుండా పోయింది. ఊరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని విజయ ఇంటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొందరు బంధువులు అనుకున్నారు.

ఫారెస్టులో శవమైన విజయ

ఫారెస్టులో శవమైన విజయ

తిరువణ్ణామలై జిల్లాలోని కన్నమడై రిజర్వు ఫారెస్టులో సగం కాలిన మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల మహిళ గురించి ఆరా తీస్తున్న సమయంలో విజయ కనపడటం లేదని ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అడవిలో చిక్కిన మృతదేహం విజయదే అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

విజయ ఇంట్లో కిలాడి లేడీ

విజయ ఇంట్లో కిలాడి లేడీ

విజయ హత్య కేసును పలుకోణాల్లో పోలీసులు విచారణ చేశారు. ఇదే సమయంలో విజయ ఇంట్లో అద్దెకు ఉంటున్న కాంచనా, ఆమె ప్రియుడు జ్ఞానవేల్‌ల మీద పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తెలివిగా కాంచనా, ఆమె ప్రియుడు జ్ఞానవేల్‌ ను పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే సమాచారం వెలుగులోకి వచ్చింది. కంచనా గత మూడేళ్లుగా విజయ ఇంట్లో అద్దెకు ఉంటున్నదని వెలుగు చూసింది.

కాంచనాకు అక్రమ సంబంధం

కాంచనాకు అక్రమ సంబంధం

కాంచనా భర్త చనిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కాంచనా, జ్ఞానవేల్ ల మధ్య చాలా సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కాంచనాకు అక్రమ సంబంధం ఉందని ఆమె ఇంటి ఓనర్ విజయకు ముందు నుంచి తెలిసినా ఆమె పెద్దగా పట్టించుకోలేదని సమాచారరం. గత 6 నెలలుగా కాంచనా ఇంటి అద్దె చెల్లించకుండా విజయను వేధిస్తోందని వెలుగు చూసింది.

అందరిముందు తిట్టిందని చంపేశారు

అందరిముందు తిట్టిందని చంపేశారు

ఇంటి అద్దె చెల్లించకుండా కాలం గడుపుతున్న కాంచనాను అందరి ముందు దూషించిన విజయ వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యాలని చెప్పింది. ఇదే విజయంలో ఇంటి యజమాని విజయ మీద రగిలిపోయిన కాంచనా ఆ విషయం ప్రియుడికి చెప్పింది. విజయను హత్య చేస్తే ఇంటి అద్దె వేధింపుల నుంచి బయటపడి సుమారు 100 తులాల నగలు, నగదు దోచుకోవాలని కాంచనా, ఆమె ప్రియుడు ప్లాన్ చేశారు.

ప్రియుడితో కలిసి ఇంటి ఓనర్ ను చంపేసిన కిలాడీ లేడి

ప్రియుడితో కలిసి ఇంటి ఓనర్ ను చంపేసిన కిలాడీ లేడి

ఇంట్లో ఓంటరిగా ఉన్న విజయ తలపై ఇనుపరాడ్ తో కొట్టిన కాంచనా, ఆమె ప్రియుడు హత్య చేశారు. హత్యకు గురైన విజయ మృతదేహాన్ని జ్ఞానవేల్‌కు ఆటోలో తీసుకెళ్లి తిరువణ్ణామలై సమీపంలోని తచ్చంపటు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తరలించారు. విజయ మృతదేహం మీద పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో కంచనా అంగీకరించిందని పోలీసులు అన్నారు, విజయను హత్య చేసి బంగారు నగలు, డబ్బు దోచుకెళ్లారని పోలీసులు అన్నారు. ఇంటి అద్దె వేధింపుల నుంచి బయటపడేందుకు మహిళను హత్య చేసి నిప్పంటించిన ఘటన వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని ప్రజు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+