Wife: భార్య చెల్లితో బమ్ చుక్ బమ్ చుక్, భార్యతో చికుబకు చికుబమ్, డాక్టర్ బాబు డ్రామాలు !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఓ డాక్టర్ కు పెళ్లి సంబంధాలు చూశారు. డాక్టర్ సంబంధం రావడంతో యువతి కుటుంబ సభ్యులు సంతోషించారు. డాక్టర్ తో పెళ్లి జరిగింది. డాక్టర్ భర్తతో ఆమె చక్కగా కాపురం చేసింది. భార్యకు ఓ చెల్లెలు ఉంది. భార్యతో పాటు ఆమె పుట్టింటికి వెలుతున్న డాక్టర్ మరదలిని లైన్ లో పెట్టాడు. అక్క మొగుడితో మరదలు సరసాలు ఆడింది. మరదలితో బమ్ చుక్ బమ్ చుక్ అని పాట పాడుతున్న డాక్టర్ అతని భార్యతో చికుబుక్ చికుబుమ్ అని డ్యూయెట్లు పాడాడు. చివరికి క్లైమాక్స్ ఒకరు శవమైనారు. డాక్టర్ భర్త డ్రామాలు ఆడటంతో పోలీసులు నాలుగు పీకితే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

డాక్టర్ భార్య దారుణ హత్య
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బదర్‌పూర్ లో డాక్టర్ ఫరూఖ్ ఆలం అలియాస్ ఫరూఖ్ నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నస్రీన్ అనే యువతిని డాక్టర్ ఫరూఖ్ వివాహం చేసుకున్నాడు. ఈనెల 13వ తేదీన ఫరూఖ్ భార్య నస్రీన్ హత్యకు గురైయ్యింది. డాక్టర్ ఫరూఖ్ గాయపడి ఉన్నాడు. చికిత్స చేసుకోవడానికి పేషెంట్ల లాగా మా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు తనపై దాడి చేసి తన భార్య నస్రీన్ ను చంపేశారని, నగలు, నగదు చోరీ చేసి పారిపోయారని డాక్టర్ ఫరూక్ పోలీసులకు చెప్పారు.

డాక్టర్ బాబు డ్రామాలు
ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడం మొదలైయ్యింది. తరువాత డాక్టర్ ఫరూఖ్ భార్య నస్రీన్ అంత్యక్రియలు జరిపించారు. నస్రీన్ అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత డాక్టర్ ఫరూఖ్ కు ఫోన్ చేసిన పోలీసులు విచారణకు రావాలని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. పోలీస్ స్టేషన్ లో కూడా డాక్టర్ ఫరూఖ్ డ్రామాలు ఆడాడు. ఆ సమయంలో పోలీసులు డాక్టర్ బాబుకు నాలుగు తగిలించారు.

మరదలితో బమ్ చుక్ బమ్ చుక్
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఫరూఖ్ భార్య నస్రీన్‌కు ఓ సోదరి ఉందని, అతనితో డాక్టర్ బాబు రొమాన్స్ చేశాడని తెలిసింది, భార్య నస్రీన్ చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఫరూఖ్ ఆమెతో బమ్ చుక్ బమ్ చుక్ అని ఎంజాయ్ చేశాడు. తరువాత నీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని డాక్టర్ ఫరూఖ్ అతని భార్య నస్రీన్‌కు చెప్పాడు. చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని డాక్టర్ ఫరూఖ్ చెప్పడంతో పెళ్లికి అతని భార్య నస్రీన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

భార్యతు చుక్ బుక్ చుక్ బమ్ డ్యూయెట్ పాడి చంపేశాడు
డాక్టర్ ఫరూఖ్ అతని మరదలిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మొండిగా అతని భార్య నస్రీన్ కు చెబుతూనే ఉన్నాడు. అతని భార్య నస్రీన్ మాత్రం రెండో పెళ్లికి అడ్డుపడుతూ వచ్చింది. ప్రేమికుల దినోత్సవం ముందురోజు ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి ఫరూఖ్ అతని భార్య నస్రీన్ తో కోరిక తీర్చుకుని పక్కనే పడుకుని మాట్లాడుతున్నట్లు నటించి టవల్ తో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. తరువాత అందరికి డౌట్ రాకుండా డాక్టర్ ఫరూఖ్ బ్లేడ్‌తో అతని చేతిని గాయపరిచుకుని దొంగలు దాడి చేసినట్లు నటించి డ్రామాలు ఆడాడని పోలీసులు అన్నారు. ఈ కేసులో పోలీసులు భార్య నస్రీన్ ను హత్య చేసిన నిందితుడు ఫరూఖ్‌ను అరెస్టు చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications