Illigal affair: పేరుకు లవ్ మ్యారేజ్, ఆంటీని తగులుకున్న మొగుడు, రాత్రి భార్య, కూతురు !
బెంగళూరు/కోలారు: డిగ్రీ పూర్తి చేసిన యువతి ఓ యువకుడు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న యువతి యువకుడు వివాహం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతితో కాపురం చేసిన భర్త ఒక అమ్మాయికి తండ్రి అయ్యాడు. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ఇంట్లో భార్యకు నరకం చూపించాడు. అక్రమ సంబంధంతో పరాయి స్త్రీ వ్యామోహంలో పడిపోయిన భర్త టార్చర్ పెట్టడంతో 2 సంవత్సరాల కుమార్తెను చంపేసి భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కొన్ని సంవత్సరాల ప్రేమ
కర్ణాటకలోని కోలారు తాలుకా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) చిన్నాపర గ్రామానికి చెందిన భానుప్రియాయ అలియాస్ భవాని (24) అనే యువతి, హరీష్ అనే యువకుడు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ప్రేమించుకుంటున్న సమయంలోనే హరీష్, భానుప్రియా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

కూతురు పుట్టింది
మూడు సంవత్సరాల క్రితం భానుప్రియా, హరీష్ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. సంతోషంగా కాపురం చేస్తున్న భానుప్రియా, హరీష్ కు రెండు సంవత్సరాల క్రితం అమ్మాయి పుట్టింది. కూతురు నిధి పుట్టిన తరువాత హరీష్ అతని భార్య భానుప్రియాతో కలిసి సంతోషంగా కాపురం చేశాడు.

ప్రియురాలితో మొగుడు మస్త్ మజా
కోలారు- బెంగళూరు హైవే సమీపంలోని నరాసుపరం ఇండస్ట్రియల్ ఏరియాలో హరీష్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెలుతున్న హరీష్ రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న హరీష్ ఆమెతో పిచ్చపాటిగా జల్సా చేస్తున్నాడు. హరీష్ రాత్రి పూట ఇంటికి వెళ్లకుండా ప్రియురాలి ఇంటికి వెలుతున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో భర్త హరీష్ అక్రమ సంబంధం విషయం అతని భార్య భానుప్రియాకు తెలిసిపోయింది.

నీ దిక్కున్నచోట చెప్పుకో..... లేదా కట్నం తీసుకురా ?
నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు పరాయి స్త్రీతో నువ్వు కులుకుతున్నావని, నాకు అన్యాయం చేస్తున్నావా ? అంటూ భార్య భానుప్రియా ఆమె భర్త హరీష్ ను నిలదీసింది. ఇదే విషయంలో రోజు ఇంట్లో గొడవలు మొదలైనాయి. ప్రియురాలి మోజులో భార్య భానుప్రియాను చిత్రహింసలకు గురి చేస్తున్న హరీష్ పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలని టార్చర్ పెడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

బిడ్డను చంపేసి భార్య ఆత్మహత్య
అక్రమ సంబంధం విషయంలో భార్య భానుప్రియా, హరీష్ ఈ మధ్యకాలంలో ప్రతినిత్యం గొడవలు పడుతున్నారు. భర్త హరీష్ చెప్పిన మాట వినడం లేదని జీవితంపై విరక్తి చెందిన భానుప్రియా రాత్రి ఆమె కుమార్తె నిధిని గొంతు నులిమి చంపేసి తరువాత ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

భర్తకు బెండ్ తీసిన పోలీసులు
పరాయిస్త్రీ వ్యామోహంలో భానుప్రియాను టార్చర్ పెట్టి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి హరీష్ కారణం అయ్యాడని ఆరోపిస్తూ భానుప్రియా కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. అక్రమ సంబంధం కారణంగా భార్య, కూతురు ఆత్మహత్యకు కారణం అయిన హరీష్ ను పోలీసులు అరెస్టు చేసి భడితపూజ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications