ఐటీ హబ్ లో ఒక్కరికి ఒక్కక్యాన్ మాత్రమే తాగునీరు, ఆ వాటర్ క్యాన్ ను మడతపెట్టి దేవుడా!

బెంగళూరు నగరంలో నీటి కొరత రోజురోజుకూ పెరుగుతోంది. తాగునీటికి సైతం సుదూరప్రాంతాలకు నీటి క్యాన్లు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రివర్స్‌ ఆస్మాసిస్‌ (ఆర్‌వో) యూనిట్ ప్లాంట్లు మూతపడుతుండగా, కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కరికి ఒక క్యాన్‌ వాటర్‌ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉందని బోర్డులు ఏర్పాటు చెయ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు.

తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి తీవ్రస్థాయిలో నెలకొంది. ఈసారి వేసవి ప్రారంభంలోనే బోరుబావులు ఎండిపోయాయి. కావేరి నీరు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల నీటి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. అయితే ట్యాంకర్‌ నీటి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతుండడంతో బెంగళూరు ప్రజలు తాగునీటి కోసం ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

In Bengaluru RO plants only one can of drinking water is given to each person

ఆర్‌ఓ యూనిట్లలో కూడా నీటి కొరత ఉండడంతో ప్రతి ఒక్కరికీ ఒక్క క్యాన్ మాత్రమే నీరు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ఆర్ ఓ ప్లాంట్ లలో ఒక్కొక్కరికి ఒక క్యాన్‌ నీళ్లు మాత్రమే ఇస్తామని కొత్త నిబంధన బెంగళూరు సిటీలో మొదలైంది. బెంగళూరు నగరంలోని పలు చోట్ల ముఖ్యంగా రాజరాజేశ్వరి నగరంలోని ఆర్‌ఓ ప్లాంట్‌లో ఈ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బెంగళూరు నగరంలోని చాలాచోట్ల రివర్స్ ఆస్మాసిస్ (ఆర్ఓ) ప్లాంట్లు నీటి కొరత కారణంగా ఇప్పటికే భారీ సంఖ్యలో మూతపడ్డాయి.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు మూసివేసే పనిలో ఉన్నాయి. ఇంకా కొన్ని ఆర్ఓ యూనిట్లలో పెరుగుతున్న విద్యుత్, నీటి ఖర్చులను నిర్వహించడానికి 20 లీటర్ల తాగునీటి ధర రెట్టింపు చేయబడింది. బెంగళూరులోని యశ్వంతపురం, ఆర్‌ఆర్‌నగర్‌, కెంగేరి, మహదేవపుర తదితర ప్రాంతాల్లో బోర్‌వెల్‌ నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో యశ్వంతపురంలో మాత్రమే 15కి పైగా ఆర్‌ఓ యూనిట్లు మూతపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+