lady inspector: యువన్ శంకర్ రాజా మ్యూజికల్ నైట్, మేడమ్ కొడుకు తల చిప్పలు, రాడ్లతో బౌన్సర్లతో ?
ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో లేడీ ఇన్స్ పెక్టర్ కొడుకు మీద బౌన్సర్లు ఇనుప రాడ్లు, ప్లాస్టిక్ చేర్లతో దాడి చేశారు. అసలే లేడీ ఇన్స్ పెక్టర్, పైగా క్రైమ్ బ్రాంచ్ లో ఉన్నారు. ఇక కథ ఏరకంగా ఉంటుందో ఊహి
చెన్నై/తిరుచ్చి: సినిమా తారలను చూడటానికి, మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ కు వెళ్లడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రైవేట్ కంపెనీల యజమాన్యాలు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి కంపెనీల పేర్లను ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు కొత్తకొత్తగా ప్లాన్ చేస్తుంటారు. అయితే చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో లేడీ ఇన్స్ పెక్టర్ కొడుకు మీద బౌన్సర్లు ఇనుపరాడ్లు, ప్లాస్టిక్ చేర్లతో దాడి చెయ్యడంకలకలం రేపింది. అసలే లేడీ ఇన్స్ పెక్టర్, పైగా క్రైమ్ బ్రాంచ్ లో ఉన్నారు. ఇక కథ ఏరకంగా ఉంటుందో ఊహించుకోండి.

యువన్ శంకర్ రాజా మ్యూజికల్ నైట్
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని మొరాయ్ సిటీలో తరచుగా సినిమా తారలతో సంగీత కచేరీలు, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈనెల 10వ తేదీన ఇళయరాజా కుమారుడు, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా పాటల కచేరీ జరిగింది. యువన్ శంకర్ రాజా మ్యూజికల్ నైట్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. తిరుచ్చితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు యువన్ శంకర్ రాజా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరైనారు.

లేడీ సీఐ కొడుకు
తిరుచ్చి పుత్తూరు రామలింగ నగర్ 1వ వీధిలో మహ్మద్ హసీం, అజీమ్ బేగం అలియాస్ అజీమ దంపతులు నివాసం ఉంటున్నారు. మోహమ్మద్ వాసీం, అజీమ్ బేగం కుమారుడు మహమ్మద్ వాసీమ్ (20) వల్లం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అజీమ్ తిరుచ్చి జిల్లా క్రైమ్ స్టేషన్‌లో లేడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. లేడీ ఇన్స్ పెక్టర్ అజీమ్ ఆమె కుమారుడు మహమ్మద్ వాసీమ్ ను బాగా చదివిస్తున్నారు.

రెచ్చిపోయిన బౌన్సర్లు
యువన్ శంకర్ రాజా పాటల కచేరీ చూసేందుకు మహమ్మద్ వాసీమ్ అతని బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో కచేరీలో ఉన్న బౌన్సర్లు ప్రేక్షకులతో వాగ్వాదానికి దిగి పలువురిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో లేడీ ఇన్స్ పెక్టర్ అజీమ్ కుమారు మోహమ్మద్ హసీమ్, అతని బంధువులకు, బౌన్సర్లుకు గొడవ జరిగింది. ఆ సమయంలో రెచ్చిపోయిన బౌన్సర్లు ప్లాస్టిక్ కుర్చీలు, ఇనుప రాడ్ లతో లేడీ ఇన్స్ పెక్టర్ అజీమ్ కుమారుడు మోహమ్మద్ వాసీమ్, అతని బంధువుల మీద దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

4. అందరివాడు
మేడమ్ ఊరికే ఉంటారా చెప్పండి ?
తీవ్రంగా గాయపడిన మోహమ్మద్ వాసీమ్ ను కొందరు రక్షించి తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోహమ్మద్ వాసీమ్ తిరువెరుంపూర్ పోలీస్ స్టేషన్‌లో యువన్ శంకర్ రాజా కార్యక్రమంలో ఉన్న బౌన్సర్ల మీద ఫిర్యాదు చేశారు. యువకుడి ఫిర్యాదు ఆధారంగా యువన్ శంకర్ రాజా పాటల కచేరీకి హాజరైన 10 మంది బౌన్సర్లపై తిరువెరంపూర్ పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలే లేడీ ఇన్స్ పెక్టర్ అయిన అజీమ్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ లో ఉన్నారు. కన్న కొడుకు మీద బౌన్సర్లు దాడి చేస్తే లేడీ ఇన్స్ పెక్టర్ చూస్తూ ఉంటారా, ఇక బౌన్సర్ల కథ చూడటానికి పోలీసులు సిద్దం అయ్యారు. అయితే గొడవ జరిగిన నాలుగు రోజుల తరువాత కేసు నమోదు కావడంతో ఈ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications