Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఒక్క పాస్‌పోర్ట్ ఉంటే ఏకంగా 192 దేశాలు వీసా లేకుండా చుట్టేయవచ్చు

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితా వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన దేశాలకు చెందిన పాస్ పోర్టులను గుర్తించే ఇండెక్స్ ఇది. దీంతో పాటు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల జాబితాను కూడా ఇది విడుదల చేసింది. ఆయా దేశాల ఆర్థిక, విదేశాంగ వ్యవహారాలు, ఇతర కార్యకలాపాలు, ఏటా వాటిని సందర్శించే పర్యాటకులు, ప్రయాణికుల సంఖ్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇండెక్స్ రూపుదిద్దుకుంటుంది.

దీని ప్రకారం- భారత పాస్‌పోర్ట్ 80వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే అయిదు స్థానాలు మెరుగుపర్చుకుంది. గత ఏడాది భారత్ 85వ స్థానంలో ఉండగా, 57 దేశాలకు వీసా రహిత సౌకర్యం ఉండేది. 2024లోనూ భారత్ 80వ స్థానంలోనే నిలిచింది. ఈ ఏడాది నైజర్, అల్జీరియాలతో కలిసి భారత్ 80వ స్థానాన్ని పంచుకుంది. భారత పాస్‌పోర్ట్ దారులు ప్రస్తుతం 55 దేశాలకు వీసా రహితంగా లేదా వీసా-ఆన్-అరైవల్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.

India Climbs to 80th on Henley Passport Index 2026 Expanding Visa-Free Reach to 55 Destinations

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026- ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మొదటి మూడు పాస్‌పోర్టులు ఆసియా దేశాలవే. సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. జపాన్, దక్షిణ కొరియాలు సంయుక్తంగా రెండోవ స్థానాన్ని దక్కించుకున్నాయి. సింగపూర్ పాస్‌పోర్టు హోల్డర్లు మొత్తం 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇది రికార్డు. ప్రపంచంలో మొత్తం 227 దేశాలు ఉండగా.. ఏకంగా 192 దేశాలకు సింగపూర్ పాస్ట్ పోర్టు హోల్డర్లు ఎటువంటి వీసా తీసుకోనక్కర్లేదు.

జపాన్, దక్షిణ కొరియా పౌరులకు 188 దేశాలకు వీసా రహిత ప్రవేశం లభిస్తుంది. డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లక్సెంబర్గ్‌ దేశీయులు 186 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో మూడవ స్థానాన్ని పంచుకున్నాయి. 199 పాస్‌పోర్టులు, 227 గమ్యస్థానాలపై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ఇండెక్స్ వీసా రహిత ప్రవేశ దేశాలను నిర్ణయిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గత ఏడాది కంటే అయిదు స్థానాలు మెరుగుపడి అయిదో స్థానానికి చేరుకుంది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 20 ఏళ్ల చరిత్రలో యూఈఏ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. 2006 నుంచి 149 కొత్త గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని పొంది.. ఇప్పుడు ఈ ర్యాంకుల్లో 57 స్థానాలు ఎగబాకింది. గత ఏడాది తొలిసారి టాప్ 10 నుంచి బయటకు వచ్చి అనంతరం 12వ స్థానానికి పడిపోయిన అమెరికా.. ఇప్పుడు మళ్లీ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. టాప్ 10లో వచ్చింది. అత్యల్ప ర్యాంకుల్లో ఆఫ్ఘనిస్తాన్ 101వ స్థానంలో నిలవగా, 24 దేశాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశం ఉంది. పాకిస్తాన్ 98వ స్థానంలో నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+