Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ చేతికి స్విస్ బ్యాంకులో ఖాతాలున్న భారతీయుల మూడో జాబితా

న్యూఢిల్లీ/బెర్న్‌: నల్లధనానికి సంబంధించిన వ్యవహారంలో మరో పురోగతి చోటు చేసుకుంది. స్విస్‌ బ్యాంకుల్లో మన దేశ పౌరుల ఖాతాలకు సంబంధించిన మూడో జాబితా కూడా భారత్‌కు చేరింది. స్విట్జర్లాండ్‌తో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా భారతీయుల ఖాతాల వివరాలను స్విస్‌ బ్యాంకులు అందించాయి.

భారత్‌తోపాటు దాదాపు 96దేశాలకు చెందిన మొత్తం 33లక్షల ఖాతాల వివరాలను ఆయా దేశాలకు అందించినట్లు అక్కడి ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) వెల్లడించింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా ఈసారి మరో పది దేశాలకు చెందిన ఖాతాల వివరాలను ఆయా దేశాలకు అందించినట్లు ఎఫ్‌టీఏ పేర్కొంది. ఆంటిగ్వా, అజర్‌బైజాన్‌, డొమినికా, ఘనా, లెబనాన్‌, మకావు, పాకిస్థాన్‌, ఖతర్‌, సమోవా, వనౌతు దేశాలు ఉన్నట్లు తెలిపింది.

 India Gets Third List Of indian nationals, having Swiss Bank account.

అయితే, 96దేశాల ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆయా దేశాల మొత్తం పేర్లను మాత్రం వెల్లడించలేదు. కేవలం ఆ జాబితాలో భారత్‌ ఉన్న విషయాన్ని మాత్రమే ఎఫ్‌టీఏ వెల్లడించింది. భారత్‌కు చెందిన పౌరుల, సంస్థల పేరుతో స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల వివరాలను గత నెలలోనే భారత అధికారులతో పంచుకున్నట్లు ఎఫ్‌టీఏ వెల్లడించింది.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand

    కాగా, ఆటోమేటిక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఏఈఓఐ)లో భాగంగా స్విట్జర్లాండ్‌ నుంచి 2019లో భారత్‌కు తొలి జాబితా అందింది. అనంతరం 2020 సెప్టెంబర్‌లో భారత్‌ రెండో జాబితా అందగా.. తాజాగా మూడో జాబితా కూడా అందింది. ఈసారి మాత్రం తొలిసారిగా భారతీయుల స్థిరాస్తుల వివరాలతో కూడిన సమాచారం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లో అపార్టుమెంట్లు, ఫ్లాట్ల వివరాలతో పాటు ఆయా స్థిరాస్తుల ద్వారా వారు సంపాదిస్తున్న ఆదాయ వివరాలు కూడా అందులో ఉండనున్నట్లు సమాచారం. ఈ జాబితాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వేచిచూడాలి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+