ఇస్రో మరో భారీ ప్రయోగం: 12న నింగిలోకి 31ఉపగ్రహాలు

Subscribe to Oneindia Telugu

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమవుతోంది. జనవరి 12న నింగిలోకి 32 ఉపగ్రహాలను పంపించేందుకు సర్వం సిద్ధం చేసింది. వీటిలో భారత్‌కు చెందిన రిమోట్ సెన్సింగ్స్ ఉపగ్రహం కార్టోశాట్-2 కూడా ఉంది.

ప్రయోగానికి జనవరి 10న కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. ఇస్రో పంపించనున్న 31 ఉపగ్రహాల్లో 28 అమెరికాకు చెందిన ఉపగ్రహాలున్నాయి. గత ఆగస్టు 31న నెల్లూరులోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన 8వ నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇక్కడి నుంచే ప్రయోగించనుంది.

India to Launch 31 Satellites on January 12: ISRO
  ISRO Break World-Record : ISRO 104 Satellites Launch - Oneindia Telugu

  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ-సి40) రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ముందుగా చెప్పినట్టుగానే జనవరి 10న ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలవుతుందని ఇస్రో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ దేవి కార్నిక్ సోమవారం తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  India will launch 31 satellites, including earth observation spacecraft Cartosat, on January 12 instead of its earlier tentative schedule on January 10, a space official said on Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి