ఆఫీస్సుల్లో పెరుగుతున్న కామ వాంఛ.. పది మందిలో నలుగురికి ఇల్లీగల్ ఎఫైర్స్

దాంపత్య జీవితం లో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు వున్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. ఇంకా ఏయే కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం. భారతదేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో పని చేసే చోట( ఆఫీస్సుల్లో) కూడా ఎక్కువగా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్నట్టు బయటపడింది.

India Ranks 2nd in Office Romance Study Reveals Growing Extramarital Affairs in India

ప్రతి పది మందిలో నలుగురు ఇలాంటి రిలేషన్‌లో ఉన్నారని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.ప్రముఖ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ఆష్లే మాడిసన్, యూగోవ్‌తో కలిసి నిర్వహించిన తాజా సర్వేలో భారతదేశం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులు తమ సహోద్యోగులతో డేటింగ్ (Romance) చేయడానికి ఆసక్తి చూపే విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే, ఇండియా రెండో స్థానంలో నిలిచింది.11 దేశాలకు చెందిన 13,581 మంది పాల్గొన్న ఈ సర్వేలో, తమ ఆఫీస్ సహోద్యోగులతో రొమాన్స్ లేదా డేటింగ్ చేయడానికి ఇష్టపడే వారి శాతం ఇలా ఉంది.

మెక్సికో: 43% మంది ఉద్యోగులు ఆఫీస్ రొమాన్స్‌కు ఆసక్తి చూపించి టాప్ ప్లేస్‌లో నిలిచారు.

భారతదేశం: 40% మంది ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూపించి రెండవ స్థానం దక్కించుకున్నారు.

అమెరికా, యూకే, కెనడా: ఈ మూడు దేశాలు 30% శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆశ్చర్యకరంగా, ఈ విషయంలో పురుషులు మహిళల కంటే ఎక్కువ ఆసక్తి చూపించారు. 51% మంది ఆఫీస్ సహోద్యోగినితో రొమాన్స్‌కు ఇంట్రెస్ట్ చూపించగా, మహిళలు కేవలం 36% మంది మాత్రమే ఇందుకు సుముఖత చూపించారు.దీనికి ప్రధానంగా వృత్తిపరమైన కారణాలు , కెరీర్ భద్రతపై ఉండే ఆందోళనలే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా, 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత, ఇలాంటి సంబంధాల వల్ల కెరీర్ దెబ్బతింటుందనే భయంతో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాలు ఆధునిక భారతదేశంలో పని ప్రదేశంలో మరియు వ్యక్తిగత జీవితంలో సంబంధాలు ఎలా మారుతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+