దేశంలో మళ్లీ మొదటికొచ్చిన కరోనా మరణాలు: నాలుగు వేలకు టచ్: అదొక్కటే ఊరట

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకూ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్నటి దాకా 80 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు.. మరింత తగ్గాయి. 70 వేలకు పడిపోయాయి. ఈ స్థాయిలో కరోనా కేసులు తగ్గడం 72 రోజుల తరువాత ఇదే తొలిసారి. డిశ్చార్జీలు రెట్టింపు సంఖ్యలో నమోదవుతోన్నాయి. కరోనా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తోన్నాయి. మరణాల్లో ఆ వేగం తగ్గట్లేదు. రోజురోజుకూ వాటి సంఖ్య మెరుగుపడుతూనే ఉంది. నాలుగు వేల వరకు కరోనా మరణాలు రికార్డయ్యాయి. కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోన్నప్పటికీ- మరణాల సంఖ్య మింగుడు పడట్లేదు.

Recommended Video

    Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !

    దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 70,421 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,921 మంది మరణించారు. 1,19,501 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. 10 లక్షల దిగువకు చేరాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. ఇందులో 2,81,62,947 మంది కోలుకున్నారు. 3,74,305 మంది మృత్యువాత పడ్డారు.

    India reports 70421 new Covid19 cases and 3921 deaths in the last 24 hours

    ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది భారత్. యాక్టివ్ కేసుల సంఖ్య 9,73,158గా నమోదైంది. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 25,48,49,301 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. రోజువారీ కేసులు 80 వేల దిగువకు నమోదు కావడం 72 రోజుల తరువాత ఇదే తొలిసారి. రోజువారీ పాజిటివిటీ రేటు మరింత తగ్గుతూ వస్తోంది. 21 రోజులుగా వరుసగా 10 శాతానికి దిగువకు పాజిటివిటీ రేటు ఈ సంఖ్య నమోదవుతోంది.

    కాగా- దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గాయి. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే ఈ సంఖ్య బాగా తగ్గినట్టే. ఆదివారం ఒక్కరోజే 14,92,152 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం కరోనా టెస్టింగుల సంఖ్య 37,96,24,626కు చేరింది. ఇదివరకు రోజువారీ టెస్టింగుల సంఖ్య 19 నుంచి 20 లక్షల వరకు నమోదయ్యాయి. ఈ సంఖ్య 14 లక్షలకు తగ్గింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+