డెంగ్యూకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసిందా? భారత్‌లో తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం!

ఇండియాలో డెంగ్యూ నివారణ చర్యల్లో ఓ కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు కేవలం దోమలను అరికట్టడం, వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించడంపైనే దృష్టి సారించిన ఆరోగ్య విభాగం.. ఇప్పుడు ముందస్తు నివారణ చర్యగా టీకా పంపిణీని ప్రారంభించింది. తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా, కడయనల్లూర్ కేంద్రంగా ఇండియాలోనే మొట్టమొదటి డెంగ్యూ టీకా పైలట్ డ్రైవ్‌ను అధికారులు ప్రారంభించారు. డెంగ్యూ వ్యాధి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న ఈ ప్రాంతంలో టీకా ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది.

Underwear Test: వ్యవసాయంలో కొత్త ట్రెండ్, మీ భూమి జాతకం మారాల్సిందే!
Underwear Test: వ్యవసాయంలో కొత్త ట్రెండ్, మీ భూమి జాతకం మారాల్సిందే!

కడయనల్లూర్ ఎంపికకు కారణాలు
డెంగ్యూ కేసుల సంఖ్య అత్యధికంగా ఉండే కడయనల్లూర్‌లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా వ్యాక్సిన్ పనితీరును సమర్థవంతంగా అంచనా వేయడానికి వీలవుతుంది. ఈ ప్రయోగం ద్వారా టీకా తీసుకోవడంలో ప్రజల ఆసక్తి, రెండు డోసులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడం, ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయా అని పరిశీలించడం, ఖచ్చితమైన వ్యాధి డేటాను సేకరించడం అధికారులకు సులభతరం కానుంది.

India Starts First Dengue Vaccine Pilot Drive in Tamil Nadu Using Qdenga first pilot vaccination drive

వాడుతున్న టీకా ఏది?
ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన 'తకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ' అభివృద్ధి చేసిన 'క్యూడెంగా' అనే టీకాను ఉపయోగిస్తున్నారు. ఇది 'లైవ్-అటెన్యుయేటెడ్, టెట్రావాలెంట్' రకానికి చెంది వ్యాక్సిన్. అంటే ఇది డెంగ్యూ వైరస్‌కు చెందిన నాలుగు వేర్వేరు రకాలను ఎదుర్కొనేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ టీకాను 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వారికి ఉపయోగించడానికి జులై 2026లో ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.

భారత స్వదేశీ టీకాకు, దీనికి తేడా ఏమిటి?
తమిళనాడులో ఇస్తున్న జపాన్ వ్యాక్సిన్‌కు, భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న డెంగ్యూ వ్యాక్సిన్‌కు తేడా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేస్తున్న 'డెంగీఆల్'టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే తమిళనాడులోని కడయనల్లూర్‌లో మాత్రం జపనీస్ వ్యాక్సిన్ 'క్యూడెంగా' నే వాడుతున్నారు.

మనుషులుండేది మూడేళ్లే.. గూగుల్ ఎక్స్ చీఫ్ వార్నింగ్!
మనుషులుండేది మూడేళ్లే.. గూగుల్ ఎక్స్ చీఫ్ వార్నింగ్!

డెంగ్యూ నివారణకు టీకా ఎందుకు కీలకం?
ఏడిస్ రకం దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది. దీనివల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది రక్తస్రావం, ప్లాస్మా లీకేజీ, షాక్ లేదా అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వేగవంతమైన పట్టణీకరణ, నీటి నిల్వ పద్ధతుల వల్ల ఇండియాలో ప్రతి ఏటా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా అందుబాటులోకి రావడం డెంగ్యూ ముప్పును తగ్గించడంలో ఓ బలమైన ఆయుధంగా మారనుంది.

తదుపరి పరిశోధనలు
కడయనల్లూర్ కార్యక్రమ విజయాన్ని కేవలం టీకాలు వేసిన సంఖ్యతో మాత్రమే కాకుండా శాస్త్రీయ పర్యవేక్షణ ద్వారా నిరూపించాల్సి ఉంది. అర్హులైన ప్రజలు రెండు డోసులను పూర్తి చేస్తున్నారా, ప్రతికూల ఫలితాలు ఏమైనా వస్తున్నాయా, ల్యాబ్ ద్వారా నిర్ధారించబడిన డెంగ్యూ కేసులు, ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తగ్గుతోందా అనే అంశాలను నిశితంగా పరిశీలించనున్నారు. ఐసీఎంఆర్‌కు చెందిన ఇద్దరు సైంటిస్తులు కడయనల్లూర్‌లో ఈ టీకా ప్రభావాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+