Unlock 4.0 : కేంద్రం తాజా మార్గదర్శకాలివే... మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్...
కేంద్ర ప్రభుత్వం 'అన్‌లాక్ 4' మార్గదర్శకాలను జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.ఇందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్ల నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చింది. సామాజిక, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక,వినోద,మతపరమైన ఫంక్షన్లకు సెప్టెంబర్ 21 నుంచి అనుమతినిచ్చింది. అయితే 100 మందికి మించి అందులో పాల్గొనవద్దని నిబంధన పెట్టింది. అలాగే ఫేస్ మాస్కులు,భౌతిక దూరం,ధర్మల్ స్కానింగ్,శానిటైజింగ్ వంటి చర్యలు తప్పనిసరి అని పేర్కొంది.
Recommended Video
రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాల అంతర్గత రవాణా పట్ల ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. వ్యక్తులు లేదా సరుకుల రవాణాకి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో లేని 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చువనని పేర్కొంది. అయితే అది స్వచ్చందంగా మాత్రమేనని,టీచర్ల మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని సూచించింది. విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల చేత లిఖితపూర్వక ఆమోదం ఉండాలని పేర్కొంది.

విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల చేత లిఖితపూర్వక ఆమోదం ఉండాలని పేర్కొంది. 50శాతం టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బంది స్కూళ్లకు వచ్చేందుకు అనుమతినిచ్చింది.
తాజా అన్‌లాక్ 4 మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్రం వెల్లడించింది. సినిమా హాళ్లు,స్విమ్మింగ్ పూల్స్,ఎంటర్టైన్‌మెంట్ పార్కులు మినహా మిగతా అన్నింటికి కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే కంటైన్‌మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకూ లాక్ డౌన్ తప్పనిసరి అని చెప్పింది. కంటైన్‌మెంట్ జోన్లు కాకుండా కేంద్రంతో సంప్రదించకుండా మరెక్కడా లోకల్ లాక్ డౌన్ విధించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications