పాక్‌పై భారత ఆర్మీ సంధించిన ఆయుధాలు ఇవే- పాక్ డ్రోన్లు మటాష్

India Pakistan War: పాకిస్తాన్‌పై దండెత్తింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడుతోంది. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం.

తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌‌పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది.

Indian extensive use of like L 70 guns air defence systems against Pak Drone attack

ప్రత్యేకించి- జమ్మూలో పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకుని రావడం కనిపించింది.ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్‌కోట్ వైపు దూసుకొచ్చాయవి. యుద్ధంలో వినియోగించే స్వార్న్ డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

వరుసబెట్టి వస్తోన్న డ్రోన్లను భారత ఆర్మీ ఎక్కడికక్కడ అడ్డుకుంది. వాటితో ఇంటర్‌సెప్ట్ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేసింది. ఆ తరువాత కొద్దిసేపటికే నియంత్రణ రేఖ వెంబడి గల సరిహద్దు గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులపై క్షిపణులను ప్రయోగించింది పాకిస్తాన్.

ఇక్కడ కూడా ఘోరంగా విఫలమైంది. పాక్ ప్రయోగించిన ఏ ఒక్క మిస్సైల్ కూడా భారత భూభాగాన్ని తాకలేదు. సత్వారి, సాంబ, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లల్లో మిస్సైళ్లను సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను పాక్ ఆర్మీ ప్రయోగించినట్లు వీటిని భారత ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. వాటిని మధ్యలోనే నేల కూల్చివేసినట్లు తెలిపాయి.

నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులు వెంబడి వివిధ ప్రదేశాల్లో స్వార్మ్ డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించినట్లు భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు వీటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపింది.

కౌంటర్-డ్రోన్ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన 50కి పైగా డ్రోన్లను విజయవంతంగా న్యూట్రలైజ్ చేసింది భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం. డ్రోన్లను కూల్చివేయడానికి ఎల్ -70 గన్స్, జెడ్ యు 23 ఎంఎం చిల్కా డిఫెన్స్, ఇతర అధునాతన కౌంటర్-యూఏఎస్ పరికరాలను విస్తృతంగా ఉపయోగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+