దావూద్ ఫ్యామిలీ పాస్ పోర్టులు ఇవే (ఫోటోలు)
న్యూఢిల్లీ: 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు పాకిస్థాన్ నుంచి వేరే దేశాలకు వెళ్లి వస్తున్నారా అని భారత్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ లోని దావూద్ ఇంటి అడ్రస్ లతో పాటు అన్ని రకాల సమాచారం సేకరించారు.
అదే విధంగా దావూద్ ఇబ్రహీంతో పాటు అతని కుటుంబ సభ్యుల అందరి పాస్ పోర్టు నెంబర్లు సేకరించారు. దావూద్ ఫ్యామిలీ సభ్యులు విదేశాలకు వెళ్లి వస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. ఇంటర్ పోల్ అధికారులతో ఎప్పటికప్పుడు ఈ విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.
భారత్ తో నేరస్తుల అప్పగింతలపై పరస్పరం ఒప్పందాలు ఉన్న దేశాలకు దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు వెళితే వారిని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ఎటువంటి పరిస్థితులలో దావూద్ గురించి సమాచారం ఇవ్వదని, అతని అరెస్టుకు సహకరించదని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.

దావూద్ కు మూడు పాస్ పోర్టులు
దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ప్రభుత్వం మూడు పాస్ పోర్టులు మంజూరు చేసింది. మొదటి పాస్ పోర్టు రావల్పిండిలో ఇచ్చారు. రెండు పాస్ పోర్టులు కరాచిలో ఇచ్చారు.

కుటుంబ సభ్యులు అందరికి
దావూద్ తో పాటు అతని భార్య మెహజబిన్, కుమారుడు మోయిన్, కుమార్తెలు మెహరుఖ్, మెహ్రీఖ్ లకు పాకిస్థాన్ పాస్ పోర్టులు ఇచ్చింది.

దావూద్ పాస్ పోర్టు నెంబర్లు ఇవే
రావల్పిండి (No.G-866537),
కరాచి (No.C-267185)
కరాచి (No.KC-285901)

కుటుంబ సభ్యుల పాస్ పోర్టులు
భార్య మెహజబిన్: (No.J-589103)
కుమారుడు మోయిన్: ( No. J-588518)
కుమార్తె మెహరుఖ్: ( No.J-563473)-జావెద్ మియాందాద్ కోడలు
కుమార్తె మెహ్రీన్: ( No. J-563439)
దావూద్ సోదరులు అనీస్: ( No.H-144394), ముస్తకీమ్: ( No.KA-713357)

మాజీ క్రికెటర్ తో సంబంధం
దావూద్ కుమార్తె మెహరిఖ్ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారుడు జునైద్ ను వివాహం చేసుకుంది.

పలు చోట్ల ఇండ్లు
దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ లో 7 ప్రాంతాలలో సొంత ఇండ్లు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు ఉన్న వారు నివాసం ఉంటున్న చోట ఇతనికి ఇండ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇతను ఇండ్లు మార్చుతుంటాడని వెలుగు చూసింది.

ఎలాగైనా సరే
దావూద్ ఇబ్రహీం ను ఎలాగైనా సరే ప్రాణాలతో పట్టుకోవాలని భారత్ నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications