వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత శాస్త్రవేత్తల ఘనత: Coronavirus తొలి మైక్రోస్కోపిక చిత్రం ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. సార్స్-కోవ్-2వైరస్(కోవిడ్-19)కు సంబంధించిన మైక్రోస్కోపిక్ చిత్రాన్ని విడుదల చేసింది. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు వ్యక్తి గొంతులో సేకరించిన నమూనాల్లో కరోనావైరస్‌ను మైక్రోస్కోప్ ద్వారా తీశారు.

జనవరి 30న కేరళలో తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐజేఎంఆర్) తాజా ఎడిషన్‌లో ఇందుకు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు.

Indian Scientists Reveal First Microscopic Image Of Coronavirus From first Patient.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తయారు చేస్తున్న కరోనా విరుగుడు మందు తయారీలో భారత్ కూడా భాగస్వామ్యం ఉంటుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. అంతేగాక, భారత్‌లోనే కరోనాను నిరోధించే మందులను తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఇది విజయవంతమైతే ఐసీఎంఆర్ ట్రయల్స్ కూడా వెళుతుందని తెలిపింది.

ఇది ఇలావుండగా, దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 850కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20కిపైగా కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 25వేల మంది కరోనా బారినపడి మరణించారు. 5లక్షల 50వేల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

కాగా, కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, సీనియర్ బ్యూరోక్రాట్స్‌కి, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఓ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో భారతదేశంలోకి అంతర్జాతీయ ప్రయాణికులు ఎంత మంది వచ్చారో.. ఆ లెక్కకు క్వారంటైన్లలో చేరిన వారి సంఖ్యకు సరిపోలడం లేదు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయంపై ఈ లేఖను కేబినెట్ సెక్రటరీ రాశారు.

అంతర్జాతీయ ప్రయాణికులపై రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాలని సూచించారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల లెక్కలో తేడా రావడం ఆందోళన కలిగించే అంశమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారానే మనదేశంలోకి కరోనావైరస్ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.

జనవరి 18, 2020 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. మార్చి 23, 2020 వరకు ప్రయాణికులను లెక్కిచామని తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఇచ్చిన వివరాల ప్రకారం 15 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని మనదేశంలోకి వచ్చారు. అయితే, రాష్ట్రాలు, కేంద్రపాలిత పర్యవేక్షించిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఈ సంఖ్యకు తేడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

English summary
Indian Scientists Reveal First Microscopic Image Of Coronavirus From first Patient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X