Viral Video: విమానంలో పరమవీర చక్ర అవార్డు గ్రహీతకు సత్కారం.. వైరల్ అయిన వీడియో.. ఇండిగోపై ప్రశంసలు..
ఇండిగో సిబ్బంది ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన వీడియోలో ఇండిగో సిబ్బంది ఓ పాపకు మొదటి పుట్టిన రోజు విమానంలో నిర్వహించారు. వైరల్ అయిన వీడియో కెప్టెన్ లేడిస్ అండ్ జెంటిల్ మెన్ అంటూ మాట్లాడుతూ.. " నా పేరు అగస్టిన్.. ఇది ముఖ్యం కాదు. ఈ రోజు ఈ పాప మొదటి పుట్టిన రోజు. చిన్నారి కేక్ కట్ చేసి అందిరికి ఇస్తుందని" అని చెప్పాడు. ఇండిగో సిబ్బంది విమానంలో చిన్నారి బర్త్ డే చేయడంపే ప్రశంసలు వర్షం కురుస్తోంది.
తాజాగా ఇండిగో విమానయాన సంస్థ పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌కు ఆదివారం తన విమానంలో పూణేకు ప్రయాణిస్తున్నట్లు గుర్తించింది. ఆయనకు గౌరవ అతిథ్యం ఇచ్చింది. సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌ను ఆన్‌బోర్డ్‌లో స్వాగతించింది. హృదయపూర్వక సందేశాన్ని, దేశం కోసం అతను చేసిన సేవల గురించి స్ఫూర్తిదాయకమైన పరిచయాన్ని వివరించింది. ఎయిర్‌లైన్ షేర్ చేసిన వీడియోలో, ఇతర ప్రయాణికులు చప్పట్లతో తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఫ్లైట్ కెప్టెన్ కుమార్‌ను బోర్డులోకి స్వాగతించారు. విమానయాన సంస్థ కుమార్ దేశానికి చేసిన సేవను స్మరించుకున్నారుప్యాసింజర్ క్యాబిన్‌లో నిలబడి, కెప్టెన్ ప్రకటించాడు "ఈ రోజు, మాతో చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. మాకు పరమవీర చక్ర గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ జీ ఉన్నారు" అని చెప్పడంతో క్యాబిన్ అంతటా చప్పట్లతో మోగిపోయింది. సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ 1999లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో తన పరాక్రమ చర్యలకు పరమవీర చక్ర పొందిన 21 మందిలో ఒకరిగా ఉన్నారు.
Flying with a hero: Subedar Major Sanjay Kumar ji, a Living Param Veer Chakra awardee! #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/CZsqlHxRj6
— IndiGo (@IndiGo6E) July 23, 2023
సంజయ్ కుమార్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని బకైన్ గ్రామం. ఆయన జూన్ 1996లో భారత సైన్యంలో చేరాడు. జమ్మూ, కాశ్మీర్ రైఫిల్స్' రెజిమెంట్‌లో పనిచేశాడు. అతనికి జులై 04, 1999న యుద్ధ సమయంలో అందించిన సేవలకు గాను భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం అయిన పరమవీర్ చక్రను ప్రదానం చేశారు. జమ్మూ & కాశ్మీర్‌లోని ముష్కో వ్యాలీలోని పాయింట్ 4875 వద్ద దాడి చేసిన కాలమ్‌లో ప్రముఖ స్కౌట్‌గా అతనికి అవార్డు లభించింది. ఫిబ్రవరి 2022లో, అతను సుబేదార్ మేజర్ స్థాయికి పదోన్నతి పొందాడు.












Click it and Unblock the Notifications