సైకో అరెస్ట్: అమ్మాయిల హాస్టళ్లలో దూరి లోదుస్తులు దొంగిలిస్తాడు, వాటిని చించేస్తాడు

ఇండోర్: సైకోగా మారిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల హాస్టళ్లలో దూరి అమ్మాయిల లోదుస్తులను దొంగిలించి, వాటిని చించేయడమే అతడు తన పనిగా పెట్టుకున్నాడు. అతని వ్యవహారాన్ని గమనించిన బాధితులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 26ఏళ్ల నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

లోదుస్తులు దొంగిలించి..

లోదుస్తులు దొంగిలించి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని విజయ్ నగర్‌లోని అమ్మాయిల హాస్టళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. అర్ధరాత్రివేళలో అమ్మాయిల హాస్టళ్లలోకి ప్రవేశించి వారి లోదుస్తులను దొంగిలించి వాటిని చించేసేవాడు. గదుల్లో ఆరేసిన, అల్మారాల్లో పెట్టుకున్న వాటినీ వదిలేవాడు కాదు.

అనేకసార్లు తప్పించుకున్నాడు..

అనేకసార్లు తప్పించుకున్నాడు..

ఇలా చాలాసార్లు చేసిన నిందితుడు.. పలుమార్లు హాస్టల్ నిర్వాహకులు పట్టుకునే యత్నం చేసినా తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో భయాందోళనలకు గురైన హాస్టల్ అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నగర్ సురక్ష సమితి, సెక్యూరిటీ గార్డులను సమన్వయం చేసిన పోలీసులు.. పక్కాప్రణాళికతో ఆ దుండగుడ్ని ఆటకట్టించారు. నిందితుడు రాత్రిపూట వస్తాడు కాబట్టి ఓ కన్నేసి ఉంచారు. శుక్రవారం రాత్రి నిందితుడు వచ్చిన విషయాన్ని గుర్తించిన స్థానికుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Recommended Video

    Porsche Car Owner Made To Do Sit-ups On Road
    పలు ప్రాంతాల్లోని అమ్మాయిల హాస్టళ్లల్లోనూ ఇదే పని..

    పలు ప్రాంతాల్లోని అమ్మాయిల హాస్టళ్లల్లోనూ ఇదే పని..

    ఆలస్యంగా చేయకుండా రంగంలోకి దిగిన పోలీసులు.. హాస్టల్లోకి ప్రవేశించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన పేరును శ్రీకాంత్ అని చెప్పుకున్నాడు. కాగా, విజయ్ నగర్ తోపాటు శీతల్ నగర్, స్వర్ణ బాగ్ కాలనీ, సుమన్ నగర్ కాలనీల్లో కూడా ఇలాంటి పాడు పనులకు పాల్పడినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. కాగా, నిందితుడు ఇలాంటి నేరాలకు గతంలో కూడా పాల్పడ్డాడు. గత సంవత్సర కాలంగా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+