Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షీనా హత్య కేసులో కీలకమలుపు: అప్రూవర్‌గా డ్రైవర్

ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి, హంతకుల్లో ఒకడైన ఇంద్రాణి ముఖార్జియా కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జైలులో విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన సాక్షి, ఇంద్రాణి ముఖార్జియా కారు డ్రైవర్ అయిన శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారి నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. షీనా బోరా హత్య కేసుకు సంబంధించి అన్ని వివరాలు తకను తెలుసునని, అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని మే 2016న కోర్టును ఆశ్రయించాడు.

శ్యామ్‌వర్ రాయ్ అప్రూవర్‌గా మారేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. అంతకముందు ఈ కేసులో శ్యామ్‌వర్ రాయ్‌ని ప్రాసిక్యూషన్ సాక్షిగా భావించేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు సీబీఐ విన్నవించిన సంగతి తెలిసిందే.

Indrani Mukerjea's Driver Allowed to Turn Approver in Sheena Bora Murder

షీనాబోరా మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు ఆమె కన్న తల్లి ఇంద్రాణి ముఖార్జియేనని శ్యామ్‌వర్ రాయ్ చెబుతున్నారు. ఏప్రిల్ 2012లో జరిగిన ఈ హత్య కేసులో మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌తో కలిసి ఇంద్రాణి ముఖర్జీయా కూతురు షీనాను దారుణ హత్య చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఇంద్రాణి ముఖర్జీయాతో పాటు ఆమెకు సహకరించిన సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్‌లతో పాటు పీటర్ ముఖర్జీయా కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా జైలు జీవితం గడుపుతున్నారు. మరోవైపు ఈ కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు ఆమె భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీయా విడాకులు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇంద్రాణీ పుట్టినరోజున ఆమెకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇస్తానని పీటర్ ఓ ప్రేమ లేఖ రాశారు. పీటర్ అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 40కుపైగా ఉత్తరాలను ఇంద్రాణీ రాసిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+