విషాదం: వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి మృతి

న్యూఢిల్లీ: నోయిడాలోని హై-రైజ్ సొసైటీలో సోమవారం వీధికుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఏడు నెలల పసికందు మంగళవారం మరణించాడు. చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 100లోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఆవరణలో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. 'బాధిత చిన్నారి తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు. ఇద్దరూ సొసైటీలో నిర్మాణ పనుల్లో నిమగ్నమై తమ బిడ్డను తమ దగ్గర ఉంచుకున్నారు. అయితే, వీధికుక్క సొసైటీలోకి ప్రవేశించి.. ఆ పిల్లవాడిని కరిచింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి' ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు.

కుక్క కాటుతో గాయపడిన పిల్లవాడిని వెంటనే నోయిడాలోని యథార్త్ ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ అతనికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, అయితే అది విఫలమైందని పోలీసు అధికారి చెప్పారు.

Infant Dies Day After Attack By Stray Dog at apartment, Noida

వీధికుక్కకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయితే విచ్చలవిడి కుక్కలను పట్టుకునేందుకు పోలీసులు సంబంధిత ఏజెన్సీలను అప్రమత్తం చేశారని ఏసీపీ తెలిపారు.

కాగా, ఈ సంఘటనతో సొసైటీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నోయిడా అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ ప్రాంతంలో అనేక వీధి కుక్కలు తిరుగుతున్నాయని, ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా పలువురిని వీధి కుక్కలు కరిచాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+