ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త: జూన్ 1 నుంచి డ్రెస్‌కోడ్ లేదు
బెంగుళూరు: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త. ఇన్ఫోసిస్ డ్రెస్ కోడ్ నిబంధనలకు సోమవారం నుంచి మార్చి వేసింది. ఇక నుంచి అన్ని రోజుల్లో సాధారణ దుస్తులు ధరించవచ్చని గత వారం కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో పేర్కొంది.
కంపెనీ పంపిన ఈ మెయిల్‌లో సోమవారం (జూన్ 1) నుంచి ఉద్యోగులకు నచ్చిన జీన్స్‌తో పాటు టీషర్ట్‌లను కూడా వేసుకోవచ్చని అందులో వెల్లడించింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఉద్యోగుల వలసలను నిర్ణయించడానికేనని తెలుస్తోంది.

డ్రెస్ కోడ్ నిబంధనలను మార్చిన తర్వాత 'ఇన్ఫోసిస్ గర్వపడే విధంగా మీ వస్త్రధారణ ఉంటుందని మేము నమ్ముతున్నాం' అని ఈ మెయిల్‌లో పేర్కొంది. ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర ఐటీ కంపెనీలు చాల వరకు శుక్రవారం మాత్రమే సాధారణ దుస్తులు వేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇన్ఫోసిస్‌లో డ్రెస్ కోడ్ నిబంధనను మార్చిన ఘనత కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాకే చెందుతుంది. కారణం ఆయనెప్పుడూ కూడా నల్ల టీషర్ట్‌తో పాటు నల్ల జాకెట్‌ను ధరిస్తారు కాబట్టి.












Click it and Unblock the Notifications