ప్రధాని మోడీ పెట్టుకున్న ఈ "ఇయర్ రింగ్" స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక పర్యటన నిమిత్తం ఒమన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని స్వయంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, గార్డ్ ఆఫ్ హానర్‌తో పాటు అత్యంత వైభవంగా ప్రధానికి స్వాగతం లభించింది. అయితే ఈ అధికారిక కార్యక్రమాల కంటే కూడా సోషల్ మీడియాలో మరో అంశం చర్చనీయాంశంగా మారింది.
కాగా ఒమన్ విమానాశ్రయంలో ఉప ప్రధాని సయ్యిద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌ను కలిసిన సమయంలో ప్రధాని మోడీ చెవి పక్కన మెరుస్తున్న ఓ వస్తువు కనిపించింది. అది చూస్తుంటే చెవిపోగు లాగా అనిపించడంతో నెట్టింట ఊహాగానాలు మొదలయ్యాయి. మోడీ కొత్త స్టైల్‌కి శ్రీకారమా?", "ఇది ఫ్యాషన్ స్టేట్‌మెంటా?" అంటూ సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే ప్రధానిగా అపారమైన బాధ్యతలు ఉన్నప్పటికీ మోడీ తన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిసిందే. ఒక సందర్భంలో తన పేరుతో నేసిన సూట్ దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో చెవిపై కనిపించిన వస్తువు కూడా ఫ్యాషన్ కోణంలోనే మొదట అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే నిశితంగా పరిశీలిస్తే అది చెవిపోగు కాదని తెలుస్తుందని అంటున్నారు. ప్రధాని మోడీ ధరించింది రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ పరికరం (Real-Time Translator Device) అని అంటున్నారు. ఇది అంతర్జాతీయ దౌత్య సమావేశాల్లో భాషా అవరోధాలు లేకుండా సంభాషణ జరగేందుకు ఉపయోగపడే ఆధునిక టెక్నాలజీ పరికరమని స్పష్టం చేస్తున్నారు.
గల్ఫ్ దేశమైన ఒమన్ అధికార భాష అరబిక్. అక్కడి నాయకులు, అధికారులతో సమావేశాల్లో వారు మాట్లాడే మాటలను తక్షణమే అర్థం చేసుకునేందుకు ఈ పరికరం ఎంతో సహాయపడుతుంది. ప్రధాని మోడీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే నేపథ్యంలో, వివిధ భాషల్లో జరిగే సంభాషణలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఇలాంటి ట్రాన్స్‌లేటర్ పరికరాలను వినియోగిస్తుంటారని క్లారిటీ ఇస్తున్నారు.
మరోవైపు ఈ పర్యటనలో భారత్-ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడ్డాయి. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇరు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications