Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

International yoga day: యోగాసనాలతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ, వీడియో వైరల్..!

రోజూ యోగా చేస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది.ఎలాంటి జబ్బులు దరిచేరవు. అన్నిటికీ మంచి మంత్రం యోగా. ఇక యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వచ్చేవారం అంటే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రపంచం జరుపుకోనుంది. ఈ సమయంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉంటారు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతాయి.

జూన్ 21వ తేదీన ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉంటున్న నేపథ్యంలో ఆయన ఐక్యరాజ్య సమితిలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొని ఆ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు.ఈ వేడుకలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు సబా కొరోసీ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ వేశారు. ఐక్యరాజ్య సమితిలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.

modiyogaday
కొరోసీ ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు."ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మిమ్మలను కలిసేందుకు ఎదురుచూస్తున్నాను.మీ భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి మరింత వెలుగును తీసుకొస్తుంది.శరీరం మనసును ఆరోగ్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచాన్ని యోగా ఏకం చేస్తుంది." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

యోగా తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ మరో ట్వీట్‌లో ప్రజలను కోరారు. అదే సమయంలో వివిధ ఆసనాలను వర్ణించే వీడియోను కూడా ప్రధాని మోదీ షేర్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+