Gujarat: గుజరాత్ యూనివర్శిటీ హాస్టల్‌పై దాడి.. అంతర్జాతీయ విద్యార్థులకు గాయాలు..
గత రాత్రి గుజరాత్ యూనివర్శిటీ హాస్టల్‌పై ఓ గ్రూప్ దాడి చేసింది. నమాజ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఆఫ్రికా దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ విద్యార్థులపై దాడి చేయడంతో ఐదుగురు అంతర్జాతీయ విద్యార్థులు గాయపడ్డారు. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి గుజరాత్‌లోని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించారు. న్యాయమైన విచారణ జరిగేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం.
అహ్మదాబాద్‌లోని క్యాంపస్‌లో మసీదు లేదని, రంజాన్ సందర్భంగా రాత్రిపూట తారావీహ్ - నమాజ్ చేయడానికి వారు హాస్టల్‌లో గుమిగూడారని విద్యార్థులు చెప్పారు. వెంటనే, కర్రలు, కత్తులతో సాయుధమైన గుంపు హాస్టల్‌లోకి చొరబడి, వారిపై దాడి చేసి, వారి గదులను ధ్వంసం చేసిందని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్‌లోని సెక్యూరిటీ గార్డు గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడని విద్యార్థులు తెలిపారు.

హాస్టల్‌లో నమాజ్ చేయడానికి ఎవరు అనుమతించారని గ్రూప్ లోని వ్యక్తులు నినాదాలు చేశారని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక విద్యార్థి తెలిపారు. "రూములలో కూడా వారు మాపై దాడి చేశారు. వారు ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, బైక్‌లను పాడు చేశారు" అని అతను చెప్పారు. గాయపడిన ఐదుగురు విద్యార్థుల్లో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, తుర్క్‌మెనిస్థాన్‌లకు చెందిన ఒక్కొక్కరు, ఆఫ్రికా దేశాలకు చెందిన ఇద్దరు ఉన్నారని విద్యార్థి తెలిపారు.
పోలీసులు వచ్చే సమయానికి గ్రూప్ పారిపోయింది. గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయా రాయబార కార్యాలయాలకు సమాచారం అందించారు. పాడైపోయిన బైక్‌లు, విరిగిన ల్యాప్‌టాప్‌లు, ధ్వంసమైన గదులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని విజువల్స్‌లో కొందరు హాస్టల్‌పై రాళ్లు రువ్వడం, విదేశీ విద్యార్థులపై దుర్భాషలాడడం కనిపించింది. హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications