International yoga day:ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఇదే..!

International Yoga Day:ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం.యోగాతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క సమగ్ర విధానాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కటి వేదికగా పనిచేస్తుంది.

2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించిన సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి యోగా అవశ్యకత, బలం, సమతుల్యత,ఫిట్‌నెస్ పెంచడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా యోగా నిలిచింది.

 yogaday

ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ "Yoga for Vasudhaiva Kutumbakam"అంటే ఒకే కుటుంబం ఒకే ప్రపంచం అనే అర్థంతో ఈ థీమ్‌ను రూపొందించారు. అందరి ఆరోగ్యం సంక్షేమం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ థీమ్ యోగా యొక్క స్ఫూర్తిని తెలుపుతుంది.ప్రతీ ఏటాలానే ఈ సారి కూడా దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పలు కార్యక్రమాలు యోగా డే సందర్భంగా నిర్వహిస్తున్నారు.

యోగా మానసిక సమస్యలకు పరిష్కారంగా చెప్పబడుతోంది. ప్రతీ రోజూ యోగాభ్యాసం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.ఒత్తిడితో పాటు ఆందోళన, నిరాశ, నిస్పృహలకు చక్కటి ఔషధం యోగా. కరోనా మహమ్మారి సమయంలో చాలామంది ఒత్తిడికి ఆందోళనకు గురయ్యారు. అలాంటి వారిలో యోగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం,మానసిక స్థితి మెరుగుదల, మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని యోగా తెలుపుతుంది.

యోగా ప్రాముఖ్యత : అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి ఏటా జూన్ 21న జరుపుకుంటారు. అనేక సంస్కృతులతో కూడిన భిన్నమైన ప్రజలను ఏకం చేయడంలో యోగా చక్కటి వేదికగా నిలుస్తుంది.యోగా దినోత్సవం రోజున తలపెట్టే పలు రకాల కార్యక్రమాల ద్వారా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.ఈ కార్యక్రమాల్లో యోగా శిక్షణా తరగతులు, వర్క్‌షాప్‌లు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

యోగా ప్రయోజనాలు : శారీరక మానసిక శ్రేయస్సు కోసం యోగా ఉపయోగపడుతుంది.యోగాసనాలు కండరాల బలహీనతలను తొలగించి శరీరం దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.రోజూ యోగాసనాలు వేస్తే సుఖమైన నిద్ర కలుగుతుంది. తద్వారా ఒత్తిడి దూరమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+