IPL 2023 : సన్ రైజర్స్ పై విరాట్ కొహ్లీ సెంచరీని ఊహించిన ఒకే ఒక్కడు-ఏం చెప్పాడంటే ?

ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అర్హత పోటీలు జరుగుతుండగా.. ఇందులో అన్ని జట్లూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ రేసులో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన పోరులో స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ విరాట్ కొహ్లీ శతకంతో పోరాడాడు. చివరికి సెంచరీ సాధించి అవుటైనా సన్ రైజర్స్ పై బెంగళూరు గెలుపుకు అప్పటికే బాటలు పడ్డాయి.

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కొహ్లీతో పాటు మరో ఓపెనర్, జట్టు కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెస్సిస్ వీరోచితంగా ఆడారు. తొలి ఓవర్ నుంచి బాదుడు మొదలుపెట్టేసిన ఈ జోడీ.. గ్రౌండ్ నలువైపులా బౌండరీలు, సిక్సర్లు కోడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. చివరకు విరాట్ కొహ్లీ సెంచరీ బాదేశాడు. అయితే ఈ సెంచరీ కొహ్లీకి చాలా విలువైనదిగా మారింది. 62 బంతుల్లోనే చేసిన ఈ సెంచరీతో కొహ్లీ.. విండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అత్యధిక సెంచరీల రికార్డు సమం చేశాడు.

 kohliduplesses-

అదే సమయంలో విరాట్ కొహ్లీతో పాటు దూకుడుగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ డూప్లెసిస్ అతనికి పూర్తి సహకారం అందించాడు. అలాగే కొహ్లీ సెంచరీ చేస్తాడని ముందుగా ఊహించాడు కూడా. ఆరంభం నుంచే తన దూకుడు చూసిన డూప్లెసీ తాను సెంచరీ చేస్తానని ఊహించినట్లు విరాట్ కొహ్లీ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. గతంలో పలుమార్లు ఇదే స్ధాయిలో ఆడినప్పటికీ ఓ చెత్త షాట్ తో నిష్కృమించిన సందర్భాలున్న కొహ్లీ.. ఈ మ్యాచ్ లో దూకుడు చూస్తే మాత్రం సెంచరీ సాధిస్తాడని కెప్టెన్ నమ్మాడు.

బెంగళూరు జట్టు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు వ్యూహం గురించి చర్చిస్తున్నప్పుడే డూప్లెసీ టాప్ 3 బ్యాట్స్ మెన్ లో ఎవరైనా ఇవాళ సెంచరీ చేస్తాడని చెప్పాడని కొహ్లీ వెల్లడించాడు. అప్పుడు తాను ఎవరైనా వందలు సాధించే అవకాశం ఉందని, మీ బ్యాటింగ్ విధానం వల్ల మీలాగే అనిపిస్తోందని చెప్పినట్లు కొహ్లీ తెలిపాడు. దీనికి స్పందించి డూప్లెసీ.. తనకే సెంచరీ చేసే అవకాశం ఉందని చెప్పాడన్నాడు. అప్పుడు తాను ఎవరైనా వందలు సాధించే అవకాశం ఉందని, మీ బ్యాటింగ్ విధానం వల్ల మీలాగే అనిపిస్తోందని చెప్పినట్లు కొహ్లీ తెలిపాడు. దీనికి స్పందించి డూప్లెసీ.. తనకే సెంచరీ చేసే అవకాశం ఉందని చెప్పాడన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+